హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన సినిమా ‘పెళ్లి సందD’. గౌరి రోనంకి తెరకెక్కించిన ఈచిత్రంలో కన్నడ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్‌గా నటించింది. గతేడాది అక్టోబర్ 15న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో అందుబాటులోకి రాబోతోంది.
‘పెళ్లి సందD’ చేయడానికి రెడీనా?? మా సినిమా రేడీ! ముహుర్తం: 24 జూన్, అందరూ ఆహ్వానితులే..’ అంటూ జీ5 స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది. ఇది చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మొత్తానికి పెళ్లి సందడి ఈ శుక్రవారంనాడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇక ఓ పట్టు పట్టాల్సిందేనంటూ కామెంట్లు చేస్తున్నారు.
పెల్లి సందD చేయడానికి రెడీనా??
మా సినిమా రేడీ!
ముహుర్తం: 24 జూన్
అందరూ ఆహ్వానితులే#PelliSandaDonZEE5 #PelliSandaD@Ragavendraraoba @mmkeeravaani @arkamediaworks @Shobu_ @boselyricist pic.twitter.com/17nMnoTzD6— ZEE5 Telugu (@ZEE5Telugu) June 21, 2022