HomeTelugu Reviewsపెళ్లి 'సందD' మూవీ రివ్యూ

పెళ్లి ‘సందD’ మూవీ రివ్యూ

Pelli sandad movie review
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన చిత్రం ‘పెళ్లి సందడి’. కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతో పాటు ఓ కీలక పాత్రలో కూడా నటించడం ఈ సినిమా ప్రత్యేకం. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరుకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ: వశిష్ట (రోషన్) బాస్కెట్ బాల్ ప్లేయర్. పెళ్ళిలో సహస్ర (శ్రీలీల)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. కానీ సహస్ర సోదరి (వితిక షేరు) తీసుకున్న ఓ నిర్ణయం ఆ ప్రేమికులు ఇద్దరినీ దూరం చేస్తుంది. తన అక్క జీవితం కోసం తండ్రి (ప్రకాష్ రాజ్)కి ఓ మాట ఇస్తుంది సహస్ర. ఇంతకీ ఆ మాట ఏమిటి? కలిసి బతకాలనుకున్న వశిష్ట… సహస్ర మధ్య బంధం ఏమయ్యింది? వాళ్ళ ఇద్దరి కథ ఎలా ఎవరి ద్వారా బయటకి వచ్చింది? అనేదే కథలోని అంశం.

Pelli SandaD

విశ్లేషణ: పెళ్లి నేపథ్యంలో సాగే కథ ఇది. అందుకే ‘పెళ్లి సందD’ అయ్యింది. అంతే తప్ప అప్పటి సినిమాకి.. ఈ కథకీ ఎలాంటి సంబంధం లేదు. మాయ (శివాని రాజశేఖర్) అనే ఓ డైరెక్టర్‌ ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీత అయిన వశిష్ట బయోపిక్ తీయాలని అనుకుంటుంది. ఎవరికీ తెలియని ఆయన స్టోరీ తెలుసుకునేందుకు మాయ తండ్రి (రాజేంద్రప్రసాద్‌) రంగంలోకి దిగుతాడు. అక్కడినుంచి మొదలవుతుందీ సినిమా. కాలం చెల్లిన కథతో ఈ నయా పెళ్లిసందD తెరకెక్కింది. కథలోనే కాదు, కథనం పరంగా కూడా ఎలాంటి కొత్తదనం కనిపించదు. రాఘవేంద్ర రావు – కీరవాణి మార్క్ పాటలు, చిత్రీకరణ తప్ప ఇందులో చెప్పుకోవాల్సిన విషయాలు ఏమీ లేవు. పాత కథని అంతే పాత పద్ధతుల్లో తెరకెక్కించారు.

నటీనటులు: హీరోహీరోయిన్‌లు జంట చూడ్డానికి ఫ్రెష్‌గా ఉంది. ఇద్దరి మధ్య ముఖ్యంగా పాటల్లో మంచి కెమిస్ట్రీ కనిపించింది. పాత్రల్లో అందం లేకపోవడంతో సన్నివేశాలు తేలిపోయాయి. భావోద్వేగాలు పండలేదు. రాఘ‌వేంద్ర‌రావు న‌ట‌న సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. పరిశ్రమలో ఉన్న ప్రధాన తారాగణం తెరపై కనిపించింది.

pellisandhad3

టైటిల్‌ : పెళ్లి సందD
నటీనటులు : రోష‌న్‌, శ్రీలీలా, బ్ర‌హ్మానందం, రావు ర‌మేశ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ప్ర‌కాశ్‌రాజ్‌, త‌దిత‌రులు
నిర్మాతలు : మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని
దర్శకత్వం: గౌరీ రోనంకి
సంగీతం : ఎం.ఎం.కీర‌వాణి

హైలైట్స్‌‌: హీరోహీరోయిన్‌ నటన
డ్రాబ్యాక్స్‌‌: కథ, కథనం

చివరిగా: ‘పెళ్లి సందD’ కొత్తదనం కనిపించదు
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu