శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో ప్రముఖ నిర్మాత మిర్యాల రవిందర్ రెడ్డి హీరోగా వస్తున్న చిత్రం ‘పెద కాపు’. అవుట్ అండ్ అవుట్ రా, రస్టిక్ నేపథ్యంలో ఈ సినిమా తెరెక్కకుతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. కులాల ఆదిపత్యాలు, రాజకీయాలు, వర్గ పోరాటాల చుట్టూ ఈ కథ జరగనున్నట్లు ట్రైలర్‌తో క్లియర్ కట్‌గా తెలిసిపోయింది. అగ్ర కులాల రాజకీయంతో బడుగు, దళిత వర్గాల జనాలు నిత్యం అణచివేతకు గురయ్యే ఓ గ్రామంలో.. ఆ రాజకీయ నాయుకలపై తిరగబడతాడు ఓ యువకుడు.
ఆ తర్వాత ఏం జరగింది. ఊర్లో అల్లర్లు, గొడవలు ఏ స్థాయికి వెళ్లాయి అన్న కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. చివరకి ఆ యువకుడి పోరాటం ఎంత వరకు సాగిందన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చాలా సెన్సిటీవ్ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కూడా పోషించాడు. మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రైండ్ మ్యూజిక్ ట్రైలర్‌ను ఓ హైకి తీసుకెళ్లింది.