జగన్ రెడ్డి వైఎస్సార్ రైతు భరోసా అంటూ ఆంధ్ర రైతులకు ఓ పథకం పెట్టాడు. పైగా అర్హత పొందిన 50,10,275 రైతు కుటుంబాలకు ప్రతి ఏడాది పెట్టుబడి సాయం అందిస్తున్నాడట. ఈ లిస్ట్ లో ఎంతమంది రైతులు ఉన్నారు అనేది ఎవరికీ అంతు చిక్కదు. ఇప్పటికే చాలామంది రైతులు తమకు ఏ సాయం అందడం లేదు అంటూ రోడ్డున పడ్డారు. మరో వైపు జగన్ రెడ్డి మాత్రం ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి గత మూడేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా సీజన్ ప్రారంభం కాకముందే రైతన్న చేతిలో పెట్టుబడి సాయం పెట్టాడు అట.
ఎప్పుడు పెట్టాడు ? అని మాత్రం అడగొద్దు. ఈ విషయంలో జగన్ రెడ్డికి కూడా క్లారిటీ లేదు. ఆ రేంజ్ లో జగన్ రెడ్డి పాలన సాగుతుంది. సరే, వైఎస్సార్ రైతు భరోసా పథకంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన కంప్యూటర్‌లో బలంగా బటన్ నొక్కి మరీ రైతుల ఖాతాల్లో డబ్బు ఎంత జమ చేశాడో తెలీదు గానీ, ప్రతి రైతు తల మీద మాత్రం ప్రతి ఏడాది అప్పు పెంచుకుంటూ పోతున్నాడు. మరి ఆ లిస్ట్ చూస్తే.. ఆంధ్ర రైతులకు నిద్ర పట్టకపోవచ్చు. కానీ, ఈ చేదు నిజాలు చెప్పక తప్పదు. అవేంటో చూడండి.
జగన్ రెడ్డి కారణంగా దేశంలో అత్యధిక రుణభారం ఏపీ రైతులపైనే ఉంది.
జగన్ రెడ్డి కారణంగా ఆంధ్రాలో ఒక్కో కుటుంబ తలసరి అప్పు రూ.2,45,554 గా ఉంది.
జగన్ రెడ్డి కారణంగా జాతీయ స్థాయిలో సగటున ఒక్కో రైతు కుటుంబంపై రూ.74,121 అప్పు ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సగటున ఒక్కో రైతు కుటుంబంపై రూ.2,45,554 చొప్పున ఉంది.
మన జగన్ రెడ్డి కారణంగా దేశంలో ఒక్కో రైతు కుటుంబం మోస్తున్న రుణ భారం కంటే, ఆంధ్ర రైతు 231 % అధిక అప్పు భారాన్ని మోస్తున్నాడు. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భాగవత్ కరాడ్ లోక్ సభలో శిరోమణి అకాలీదళ్ సభ్యుడు సుబ్బీర్సింగ్ బాదల్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. మంత్రి సమాధానం ప్రకారం దేశంలో రైతులు అత్యధిక రుణ భారం మోస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్-1 లో ఉంది.
ఇక ఇప్పటికే జగన్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేసే ఉద్దేశం ఏమీ లేదని స్పష్టం చేశాడు. కాబట్టి ఆంధ్ర రైతులారా మీరు చేయని అప్పులు మీ పై పడ్డాయి. కారణం జగన్ రెడ్డే. ఇప్పటికైనా నిలదీయండి. మిమ్మల్మి మీరు కాపాడుకోండి.