Homeపొలిటికల్ప్చ్.. జగన్ పాలనలో పిల్లలకూ అన్యాయమే !

ప్చ్.. జగన్ పాలనలో పిల్లలకూ అన్యాయమే !

Pch.. Injustice to children under Jagans rule

జగన్ రెడ్డి సీఎం అయ్యాక చేసిన ప్రతి పని కారణంగా ప్రజలు నష్టపోతూనే ఉన్నారు. కానీ, ఆంధ్ర రాష్ట్రంలోని పిల్లలు కూడా నష్టపోవడం నిజంగా చింతించాల్సిన అంశం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్సీ సిలబస్ ప్రవేశ పెట్టడం మంచిదే. కానీ సరిగ్గా ఇంగ్లీష్ రాని మాస్టర్లు ఇంగ్లీష్ లో పాఠాలు చెబితే ఏం అర్ధం అవుతుంది ?, దీనికితోడు మాతృభాషను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే.. పిల్లలకు పాఠాలు ఎలా జీర్ణం అవుతాయి. ఉన్నపల్లంగా తెలుగు మీడియం స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ రమ్మంటే ఎలా వస్తోంది ?. అయినా, ఇంగ్లీష్ మీడియంలో చదివి వచ్చిన పిల్లలు అందరూ అనర్గళంగా, ధైర్యంగా మాట్లాడేస్తారు అనుకోవడం అపోహ మాత్రమే. మనం చేసిన కృషిని మనం గట్టిగా నమ్మినపుడు, దానికి కొంత సహనం జోడిస్తే వాక్కు దానంతట అదే వస్తుంది. పని చేయకుండా చేసినట్టు మాట్లాడడం నేర్పాల్సిన స్కిల్ అని అనుకోవడం కచ్చితంగా అవివేకం. సహజంగా జగన్ రెడ్డి స్వభావం కూడా ఇదే కాబట్టి.. జగన్ రెడ్డికి తన నిర్ణయాల పై గుడ్డి అపోహలు ఎక్కువ.

కానీ. జగన్ రెడ్డి ఇక్కడ అర్ధం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ‘మారాల్సింది మీడియం మాత్రమే కాదు విద్యా విధానం’. పిల్లలకి చదువంటే మక్కువ రావాలి. పిల్లలకు బ్యురెట్టు, లిట్మస్ పేపర్లు, స్క్రూగేజి లాంటివి తెచ్చి చూపిస్తూ పాఠాలు చెబితే వాళ్ళంతా చాలా ఉత్సాహంగా ఉంటారు. కానీ స్కూల్స్ లో బోర్డులు కూడా సరిగ్గా లేకపోతే, ఇక ఆసక్తి ఏముంటుంది జగన్ రెడ్డి ?, సరే భాష విషయానికి వస్తే, గతంలో సంస్కృతం కూడా ఉండేది. వారానికి రెండు క్లాసులు. రెండు వరుసలు ముప్పై రెండు అక్షరాలు ఉన్న ఆ శ్లోకాలు పిల్లలు పాడుతుంటే.. వారి మాటల్లో స్పష్టత పెరిగేది. సంస్కృతానికి అంత గొప్ప శక్తి ఉంది. జగన్ రెడ్డి కారణంగా ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. అసలు ఆంధ్ర స్కూల్స్ లోని టీచర్స్ కి ఉన్న నాలెడ్జ్ పై టెక్స్ట్ పెడితే.. గుండెలు పగిలే నిజాలు బయట పడతాయి.

ఎందరో తాము చదివిన భాషలోనే సరిగ్గా పాఠాలు చెప్పరు. అలాంటి టీచర్స్ తోటి వేరే భాషలో చదువు చెప్పిస్తే ఇక ఆ స్టూడెంట్స్ పరిస్థితి ఏమవుతుందో పెద్దవాళ్ళు అందరూ ఆలోచించండి. అయినా, అర్ధ జీవితం ఒక భాషలో గడిపేసాక మరో భాష లో ట్రైనింగ్ ఇప్పిస్తాం అంటే అందరు ఉపాధ్యాయులకి అయ్యే పనేనా ?, జగన్ రెడ్డిని పట్టుకెళ్లి, 20 క్లాస్ ల్లో జర్మనీ నేర్పిస్తే.. మాట్లాడటం ఆయనగారి వల్ల అవుతుందా ?, లేదు కదా. టీచర్స్ పరిస్థితి కూడా అంతే. పూర్తిగా ఇంగ్లీష్ లో వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైమ్ పడుతుంది. మరి అప్పటి వరకు చదివిన పిల్లలకు ఇటు భాష పరంగా అటు శాస్త్ర పరంగా అన్యాయం జరగదా ?. ఇప్పుడు జరుగుతుంది అన్యాయమే. పోనీ జరగకుండా.. అంతా సవ్యంగా జరిగే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ మీద ఏమైన నిఘా ఉందా జగన్ రెడ్డి ?, నిజంగా నిఘా పెడితే ఆ పెట్టిన వారికి అయినా జీతాలు ఇచ్చే స్తొమత నీ ప్రభుత్వానికి ఉందా ?, మరెందుకు జగన్ రెడ్డి పిల్లల జీవితాలతో ఆడుకోవడం ?!!

Recent Articles English

Gallery

Recent Articles Telugu