పాయల్ రాజ్‌పుత్ అంటే కుర్రకారుకు బాగా గుర్తు ఉంటుంది. ఆర్ఎక్స్100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే కుర్రకారు మనసు దోచేసుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా అంతగా కలిసి రాలేదు. వెంకటేశ్, రవితేజ వంటి హీరోలతో నటించినప్పటికీ పెద్దగా క్రేజ్ రాలేదు.
తాజాగా తన ఐదేళ్ల తన సినీ కెరీర్లో అనుభవాల గురించి ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ ఈ పంజాబీ భామ దర్శకులపై సంచలన కామెంట్స్ చేసింది.
ఇండస్ట్రీలో తనను కొంతమంది దర్శకులు తప్పుదోవ పట్టించారని ఆరోపించింది. ఆర్ఎక్స్ 100 సినిమా విజయం తర్వాత తాను ఒంటరిగా హైదరాబాద్‌లో ఉండటంతో కొంతమంది అడ్వాంటేజ్ తీసుకున్నారని తనను మిస్ గైడ్ చేశారని తెలిపింది. కొంతమంది దర్శకులు తనను బాగా వాడుకున్నారని చెప్పింది.
ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేయాలో బాగా అలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపింది.వెంకటేశ్ చాలా మంచి మనిషి అని, ఆయనతో నటించడం చాలా సంతోషంగా వుందని, మళ్లీ అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని అంటోంది పాయల్ రాజ్‌పుత్.
పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నా అంటున్న ఈ భామ సినీ పరిశ్రమలో టాప్‌కి వెళ్తాం.. అలానే కిందికీ పడిపోతాం.. అందుకే తట్టుకుని నిలబడాలి అంటోంది.