HomeTelugu Trendingపాయల్‌ రాజ్‌పుత్‌ తమ్ముడు మిస్సింగ్..!

పాయల్‌ రాజ్‌పుత్‌ తమ్ముడు మిస్సింగ్..!

1 20యంగ్‌ హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ తమ్ముడు మూడేళ్ల నుంచి కనిపించడంలేదట. అతను ఇల్లు వదిలి వెళ్లి నేటికి మూడేళ్లు అవుతోందంటూ బాధపడుతున్నారు పాయల్‌. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా తెలియజేశారు. ‘నా సోదరుడు కనిపించడంలేదు. అతను మమ్మల్ని వదిలి వెళ్లి నేటికి మూడేళ్లు అవుతోంది. 2016 మార్చ్‌ 27న ముంబయిలో రాత్రి 7 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. తమ్ముడు గురించి ఆలోచించకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాం’

‘మళ్లీ నిన్ను చూస్తామన్న ఆశ రోజూ కలుగుతూనే ఉంటుంది. ఈరోజు నీ పుట్టినరోజు. హ్యాపీ బర్త్‌డే తమ్ముడు.. దేవుడు నీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆశిస్తున్నాను. నువ్వెక్కడున్నా త్వరగా ఇంటికి వచ్చేయ్. అమ్మానాన్న రోజూ నీకోసం దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నారు. నిన్ను చాలా మిస్సవుతున్నాం. వారిని బాధలో వదలి వెళ్లిపోయావు. నువ్వు లేవని వారు రోజూ కుమిలిపోతున్నారు. నువ్వు ఈ మెసేజ్‌ చూస్తావని ఆశిస్తున్నాను. ఒకవేళ నువ్వు రాలేని పరిస్థితిలో ఉంటే మాకు ఒక్కసారి ఫోన్‌ చెయ్యి. నీకోసం ఎదురుచూస్తుంటాం.’

‘చాలా సార్లు పోలీసులకు ఫిర్యాదు చేశాం. కానీ సోదరుని గురించి ఇంతవరకు ఎలాంటి సమాచారం రాలేదు. అందుకే అతని ఫోటోలను పోస్ట్‌ చేస్తున్నాను. అతని పేరు ధృవ్‌ రాజ్‌పుత్‌. వయసు 25. చివరిగా అతన్ని ముంబయిలో చూశాం. మీరెక్కడైనా తనని చూసుంటే మాకు సమాచారం అందించగలరు’ అని పేర్కొన్నారు పాయల్‌.

View this post on Instagram

My brother is missing ! It’s been 3 years u left us ,27th March,16 at 7pm from Mumbai ! Not a single day passed without, thinking of you, Not a single day passed without, hoping to see you again ! Today is your bday … HAPPY BIRTHDAY BHAI ,May god give u a long and healthy life . Bhai plz jaha par bhi h plz plz aja …Muma papa roz tere liye pray karte hai ,tujko bhot miss karte hai 😪,A part of them went with you and you left them in silent Tears ,they are dying everyday without you Sonu 😔 Hope you will find this msg ! If you are stuck somewhere,plz just try to call us once .. we are waiting for you bhai 🙏🏼 Lodged complaint several times @ mumbai police station but nothing worked out ,m uploading few pics of him ! Name- Dhruv Rajput Age -25 height 6’1” Last seen in mumbai ! If you have seen him or know his whereabouts u can contact ! #brother #brothermissing #Dhruvrajput #2016 #missingperson #missing #mumbai #plzhelp #FindDhruv 🙏🏼

A post shared by Payal Rajput (@rajputpaayal) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu