పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో మంగళవారం సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అజయ్ భూపతి డైరెక్టర్. మంగళవారం ట్రైలర్ చూసిన తర్వాత గతంలో వచ్చిన అన్వేషణ మూవీకి దగ్గరగా ఉందంటూ టాక్ వచ్చింది.
మంగళవారం సినిమాపై వస్తున్న వార్తలను కొట్టిపారేస్తున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. అన్వేషణ సినిమాకు, మంగళవారం సినిమాకు ఎక్కడా పోలిక ఉండదని వివరణ ఇచ్చాడు. గతంలోనూ చాలా థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి కానీ మంగళవారం మాత్రమే డిఫరెంట్ మిస్టీరియస్ థ్రిల్లర్ అంటున్నాడు.
మంగళవారం సినిమాపై ఓ ఇంటర్వ్యూలో అజయ్ భూపతి వివరిస్తూ ఈ సినిమా జర్నీ డిఫరెంట్‌గా ఉంటుంది. మూవీ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది అన్నాడు.
మంగళవారం సినిమాలో ఎమోషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని అన్నాడు. ఈ సినిమాకు కొనసాగింపుగా కొన్ని సినిమాలు వస్తాయి. రాబోయే చిత్రం ప్రీక్వెలా, సీక్వెలా, ఇంకోటా అనేది చెప్పలేను. కానీ ‘మంగళవారం’ వరల్డ్ మాత్రం కొనసాగుతుంది. దీన్నొక ఫ్రాంఛైజీగా మారుస్తా అని అజయ్ తెలిపాడు.
ఆర్‌ఎక్స్ 100 సినిమాతో పోల్చుకుంటే రొమాన్స్ చాలా తక్కువ. ఈ సినిమా చివర చాలా ఉత్కంఠగా ఉంటుంది. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయని తెలిపాడు. పాయల్ పాత్ర ప్రేక్షకులను కన్నీరు పెట్టిస్తుంది అన్నాడు దర్శకుడు అజయ్.
మంగళవారం అంటే కొందరు చెడ్డ రోజు అంటారు కానీ అది శుభప్రదమైన రోజు. ముందు మనకు మంగళవారమే సెలవు రోజుగా ఉండేది. బ్రిటిషర్లు పాలనలో ఆదివారం సెలవుగా మార్చారని అన్నాడు.
మంగళవారం మూవీ క్రేజీ ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాపై అజయ్ ఎంతో ధీమాగా ఉన్నాడు. దీన్నొక ఫ్రాంఛైజీగా మార్చి ఇదే వరుసలో సినిమాలు తీస్తానని అంటున్నాడు. మంగళవారం సినిమాను ఈ నెల 17న రిలీజ్ చేస్తున్నారు.