నటి పాయల్ రాజ్ పుత్ తన తెలుగు మొదటి సినిమా ఆర్ఎక్స్ 100లో బోల్డ్ సీన్స్ తో అదరగొట్టింది. అలా బోల్డ్ గా నటించాలంటే చాలా కష్టం. చాలామంది అటువంటి సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. పాయల్ మాత్రం అవలీలగా చేసేసింది.
ఆర్ఎక్స్ 100 చేసిన చాలా గ్యాప్ తరువాత సీత ఓ సాంగ్ చేసింది. ఇప్పుడు ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘వెంకిమామ’ సినిమా కాగా, రెండోది టైగర్ నాగేశ్వర రావు. 1980 కాలంలో టైగర్ నాగేశ్వర రావు పేరుమోసిన గజదొంగ. ఆయన జీవితం ఆధారంగా ఈ సినిమా తెరెక్కుతోంది. ఇందులో పాయల్ వేశ్య పాత్రలో బోల్డ్ గా కనిపిస్తోంది. వేశ్య పాత్రతో పాటు పోలీస్ గా కూడా కనిపితుందట. ఆర్ఎక్స్ 100 తో పోలిస్తే ఇందులో బోల్డ్ సీన్స్ బోలెడు ఉన్నాయని అంటున్నారు. ఈ బోల్డ్ సీన్స్ సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతాయో చూడాలి.