బోల్డ్ కథలకు పాయల్ రాజ్‌పుత్ కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. ఈమె నటించిన రెండు సినిమాలు కూడా అలాగే ఉండటంతో వాటికే పరిమితం చేసారు దర్శక నిర్మాతలు కూడా. ప్రేక్షకులు కూడా పాయల్ సినిమా అంటే కచ్చితంగా A సర్టిఫికేట్ సినిమా అని డిసైడ్ అయిపోతున్నారు. కానీ తాను అలాంటి హీరోయిన్ కాదంటుంది ఈ ముద్దుగుమ్మ. తనకు కూడా మంచి సినిమాలు చేయాలని ఉందని చెబుతుంది. దర్శకులు కూడా అలాంటి కథలు తీసుకొస్తే రేటులో రిబేట్ ఇవ్వడానికి కూడా సిద్ధం అంటుంది పాయల్. వరసగా బోల్డ్ కథలు చేస్తుండటంతో ఆమె దగ్గరికి వచ్చే కథలు కూడా అన్ని అవే అని తెలుస్తుంది.
పాయల్ ప్రస్తుతం రవితేజ హీరోగా డిస్కో రాజా సినిమా చేస్తుంది. ఈ సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా ఈమె చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ కొత్త దర్శకుడు ఈమె దగ్గరికి ఓ కథ తీసుకొచ్చాడని.. వచ్చీ రావడంతోనే ఇది బోల్డ్ కథ అని క్లారిటీ ఇచ్చేసాడని ప్రచారం జరుగుతుంది. సరే మంచి కథ అయితే చేద్దాంలే అని కథ చెప్పమంటే.. నెరేషన్ మొదలుపెట్టిన అరగంటలోనే 5 బెడ్రూమ్ సన్నివేశాలు చెప్పాడని తెలుస్తుంది. దాంతో పాయల్ రాజ్‌పుత్ చాలా సున్నితంగా ఈ కథను తిరస్కరించిందని.. మొన్నీమధ్యే RDX లవ్ సినిమా విషయంలో తాను ఇలాంటి తప్పే చేసానని చెప్పిందని తెలుస్తుంది.
ఆ దర్శకుడు కూడా బోల్డ్ సబ్జెక్ట్ అని చెప్పి.. చివరికి దాన్ని బూతు సినిమాను చేసారని బాధ పడుతుంది పాయల్. అందుకే ఇప్పట్లో బోల్డ్ కంటెంట్ జోలికి వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకదండీ.. ఇండస్ట్రీలో గుర్తింపు కోసం మొదట్లో కాస్త హద్దులు దాటినా.. తర్వాతైనా కచ్చితంగా మంచి సినిమాలు చేయాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి.. పాయల్ కూడా ఇప్పుడు ఇలాంటి గుర్తింపే కోరుకుంటుంది. మరి ఆ క్రేజ్ డిస్కో రాజాతో వస్తుందేమో చూడాలిక. ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది.