కరోనా మహమ్మారి సినిమా షూటింగ్‌లపై ఎంతటి ప్రభావం పడిందో తెలిసిందే. తారలు ప్రస్తుతం ఇంటిపట్టునే ఉంటూ తనలో దాగివున్న ఇతర కళలకు పదునుపెడుతున్నారు. కొందరు సామాజిక బాధ్యతగా తమ మనసుకు నచ్చిన పనులు చేస్తున్నారు. దానిలో భాగంగానే అందాల నటి పాయల్ రాజ్‌పుత్ కూడా తనలోని మరో కోణాన్ని బయటకు తీసింది.చిత్రకారిణిగా మారి అందమైన కాన్వాస్ పెయింటింగ్ వేసింది. ఆ పెయింటింగ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తనకు చిత్రలేఖనంలో ప్రావీణ్యమున్నా ఇంతకు ముందెప్పుడూ కాన్వాస్ పెయింటింగ్ వేయలేదంటోంది. తొలి ప్రయత్నం తనకు తాను పికాసోలా ఊహించుకుంటూ వేశాను అంటోంది. పాయల్ పెయింటింగ్‌ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.