HomeTelugu Trending'RDX లవ్‌'లో అవీ అన్నీ ఉంటాయ్‌.. సేఫ్టీ కంపల్సరీ: పాయల్‌

‘RDX లవ్‌’లో అవీ అన్నీ ఉంటాయ్‌.. సేఫ్టీ కంపల్సరీ: పాయల్‌

7a

RX 100 సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన.. హాట్‌ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం ‘RDX లవ్’ సినిమాలో నటించింది. ఈ భామ సెక్స్ పురాణం చదువుతుంది. పదిమంది ముందు సెక్స్ అనే పదం వాడ్డానికి కూడా చాలా మంది సిగ్గు పడుతుంటారు కానీ అసలు ఈ పదం పలకడానికి ఎందుకు సిగ్గు అంటుంది ఈ ముద్దుగుమ్మ. తొలి చిత్రంలోనే సంచలన పాత్రలో నటించింది పాయల్. ఈ కారెక్టర్ చూసి అంతా ఆమెకు ఫిదా అయిపోయారు. తనకు విమర్శలు వస్తాయని తెలిసినా కూడా ఆ సినిమాలో అలాంటి పాత్రలో నటించింది పాయల్.

ఇక ఇప్పుడు ఈమె RDX లవ్ సినిమాతో వస్తుంది. సెప్టెంబర్‌లోనే ఈ చిత్రం విడుదల కానుంది. శంకర్ భాను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్. లేడీ ఓరియెంటెడ్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆడవాళ్లకు సంబంధించిన చాలా విషయాలు చర్చించామని చెబుతుంది ఈ భామ. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు పడే కష్టాలు.. ఆ తర్వాత సెక్స్ గురించి.. సెక్స్‌కు ముందు వాడే కండోమ్స్ గురించి అన్నీ ఇందులో చెప్పాం అంటుంది.

7 9

ఈ విషయాల గురించి చెప్పడానికి చాలా మంది సిగ్గు పడటమో.. భయపడటమో చేస్తారని కానీ తాము మాత్రం ఈ విషయాలన్ని RDX లవ్ సినిమాలో చూపించామంటుంది పాయల్ రాజ్‌పుత్. ఈ విషయాలు చెప్పడానికి కూడా తాము సిగ్గు పడటం లేదని.. గర్వపడుతున్నాం అంటుంది ఈ బ్యూటీ. అపరిచితులతో సెక్స్ చేసారా అని టీజర్‌లో వచ్చిన డైలాగ్ చూసి తనను చాలా మంది తిట్టారని.. కానీ ట్రైలర్ విడుదలైన తర్వాత విమర్శించిన వాళ్లే ప్రశంసిస్తున్నారని చెప్పింది పాయల్ రాజ్‌పుత్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu