యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సీత’. ఈ చిత్రంలోని ప్రత్యేక గీతంలో ‘ఆర్‌ఎక్స్ 100’ భామ పాయల్ రాజ్‌పుత్ స్టెప్పులేశారు. ‘బుల్‌రెడ్డి..’ అని సాగే ఈ పాటను బుధవారం ఉదయం 10.30 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా పాయల్ స్టిల్స్‌ను విడుదల చేసింది. అందులో ఆమె బైక్‌పై సందడి చేస్తూ కనిపించారు. ‘నా మొదటి ప్రత్యేక గీతం చూడటానికి సిద్ధంగా ఉన్నారా?’ అని ఈ సందర్భంగా పాయల్ ట్వీట్ చేశారు. పాయల్ ఇటీవల వచ్చిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో అతిథి పాత్రలో నటించారు. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి. అదేవిధంగా ఓ తమిళ సినిమాలోనూ నటిస్తున్నారు.
‘సీత’ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ బాణీలు అందిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాజల్, బెల్లంకొండ కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రమిది. గతంలో వీరు నటించిన ‘కవచం’ సినిమా విడుదలైంది.