HomeTelugu Trendingడిప్రెషన్ లో ఎన్టీఆర్ హీరోయిన్

డిప్రెషన్ లో ఎన్టీఆర్ హీరోయిన్

5 13

ధోని బయోపిక్‌తో మంచి గుర్తింపు తెచ్చకున్న బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్‌ మరణ వార్త.. తన అభిమానులను ఆశ్చర్యపరిచింది. అత్యంత మానసిక వేదనతో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు డిప్రెషన్ అనేది చర్చనీయాంశంగా మారింది. ఎవరైనా డిప్రెషన్‌లో ఉంటే వెంటనే తమ తోటివారితో పంచుకోండి. స్నేహితులకు చెప్పండి. లేదంటే డాక్టర్‌ను సంప్రదించండి అంటూ సోషల్ మీడియాలో మెసేజులు పెడుతున్నారు.

కాగా తాను డిప్రెషన్‌లో ఉన్నానంటూ ఓ హీరోయిన్ తెలిపింది. టాలీవుడ్ లో ‘ప్రయాణం’, ‘ఊసరవెల్లి’ సినిమాలతో నటించిన హీరోయిన్ పాయల్ ఘోష్ తాను డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో ఈ విషయమై పోస్ట్ పెట్టిన ఆమె గత ఐదేళ్లుగా డిప్రెషన్ తో ఇబ్బందిపడుతూ మెడిసన్స్ కూడా తీసుకుంటున్నానని చెప్పింది. అలాగే తనకు పానిక్ ఎటాక్స్ వచ్చినప్పుడు తన స్నేహితులకు, ఫ్యామిలీ మెంబర్స్ కు ఫోన్ చేసి సాయం కోరుతానని, డిప్రెషన్ నుంచి బయిటపడతానని చెప్పింది.

ఈ విషయాలన్ని సోషల్ మీడియాలో చెప్తూ ..మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత గురించి పాయల్ ప్రస్తావించిది. సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం విషయమై ఆమె చాలా బాధపడుతూ.. డిస్ట్రబ్ అయ్యానని. అలాగే తన ఫాలోవర్స్ ని కూడా మానసిక ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని కోరింది. అదేవిధంగా ఎప్పటకప్పుడు తమని తాము గమనించుకోవాలని, ఏదైనా సాయిం అవసరమైతే కుటుంబ సభ్యులకు కాని స్నేహితులను కాని అడగాలని సూచించారు. అయితే కొన్నిరోజుల క్రితం పాయల్ ఘోష్‌కు కరోనా కూడా వచ్చిందని పుకార్తు వచ్చాయి. అయితే అలాంటిదే ఏం లేదని తనకు మలేరియా జ్వరం వచ్చిందని కూడా ఆమె స్పష్టత ఇచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu