బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ రాజ్ పూత్ మరణం నేపథ్యంలో నెపోటిజం.. ఫేవరెటిజంపై మళ్లీ చర్చ జరుగుతోంది. ఈ విషయంలో హీరోయిన్ పాయల్ ఘోష్ స్పందించింది. బాలీవుడ్‌లో సౌత్ హీరోయిన్స్ పట్ల చిన్న చూపు ఉంటుంది. చాలా సార్లు నన్ను బాలీవుడ్ వారు కించ పర్చినట్లుగా మాట్లాడారు. నాకు సౌత్ లో వచ్చిన ఆఫర్లు పడుకోవడం వల్లే వచ్చాయి అనేది వారి అభిప్రాయం. నేను తెలుగులో ప్రముఖులతో కలిసి పని చేశాను. దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నాను నన్ను ఎవరు కూడా పడక గదిలోకి పిలవలేదు. నన్ను ఎవరు కూడా ఆఫర్లు కోసం వాడుకోలేదు.
సౌత్ సినిమా నాకు స్వర్గంతో సమానం. బాలీవుడ్ మాత్రం నరకంలా అంది. బాలీవుడ్ లో నటించాలనే మోజుతో సౌత్ సినిమాలను వదులుకోవడం ఎంత పెద్ద తప్పో నాకు ఇప్పుడు అర్థం అయ్యింది. సౌత్ లో హీరోయిన్స్ ను చాలా గౌరవిస్తారు.. అభిమానిస్తారు. కానీ బాలీవుడ్‌లో మాత్రం నీచంగా మాట్లాడతారు. సుశాంత్‌ను బాలీవుడ్ ప్రముఖులు పట్టించుకోలేదు.. ఆయన్ను పలు సందర్బాల్లో కించ పర్చినట్లుగా మాట్లాడటం ఆయన్ను పక్కకు పెట్టడం చేశారు. అందుకే ఆయనకు ఈ పరిస్థితి అంటూ పాయల్ ఆవేదన వ్యక్తం చేసింది.