పాయల్ ఘోష్ బాలీవుడ్, తెలుగు, కన్నడ, హిందీలో సినిమాలు చేసింది. కానీ ఏ భాషలోనూ నిలదొక్కుకోలేదు. బాలీవుడ్ లో కమిట్ మెంట్ పేరుతో లైంగిక దోపడీలపై సంచలన ఆరోపణలు చేయడంతో ఏకంగా పరిశ్రమకే దూరమైంది. ఆ వివాదంతో పాయల్ మళ్లీ బాలీవుడ్ లో కనిపించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి బాలీవుడ్ పై తనదైన శైలిలో విరుచుకుపడింది.
‘దేవుడి దయవల్ల సౌత్ సినిమాల ద్వారా పరిశ్రమలోకి వచ్చాను. అలా కాకుండా ముందే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఉంటే నా దుస్తులు కూడా తొలగించేవారు. అలా చేసి నా పేరు మీద వ్యాపారం చేసుకు నేవారు. వాళ్లకి ప్రతిభతో పనిలేదు. దుస్తులు తీసేసి అమ్మాయిల అందాలు చూపిస్తే చాలు అని ఆరోపించింది. ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లో మరోసారి ఆసక్తికరంగా మారాయి.
బాలీవుడ్ లో కమిట్‌మెంట్ వ్యవహారం ఎలా ఉంటుంది అన్నపై ఇప్పటికే చాలా మంది నటీమణులు సంచలన ఆరోపణలుచేసిన సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ లాంటి నటి కూడా బాలీవుడ్ పై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో విరుచుకుపడుతుంది. పాయల్ విషయంలో కంగన కూడా మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి తాజాగా పాయల్ చేసిన ఆరోపణలపై ఎవరైనా స్పందిస్తారా? అన్నది చూడాలి.