ఎన్టీఆర్ గతం తెలిసి ఏడ్చేశాను:పాయల్‌ ఘోష్‌

మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ప్రయాణం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది పాయల్ ఘోష్. ఆ తర్వాత ఎన్టీఆర్ ఊసరవెల్లిలో మెరిసింది. మొత్తంగా ఓ పది సినిమాల్లో చేసిన ఈ బ్యూటీకి సరైనా గుర్తింపు రాలేదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది పాయల్. ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంపై స్పందిస్తూ ఉంటుంది. ఆమె గతంలో ఎన్టీఆర్‌కు మద్దతుగా పలకడంతో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా బెదిరిస్తున్నారని, అయితే, అతడికి తానెందుకు మద్దతు ఇస్తున్నానన్న విషయం ఎప్పటికీ అర్థం చేసుకోలేరని పాయల్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. బెదిరింపుల కారణంగా తాను డైరెక్ట్ మెసేజ్ ఆప్షన్ తొలగించినట్టు పాయల్ పేర్కొన్నారు.

తారక్ కూడా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారంటూ తనకు మెసేజ్‌లు వస్తున్నాయని, అయితే, సినిమా కోసం ఆయన పడే కష్టం మరెవరికీ తెలియదని అన్నారు. ఆయన పట్ల కాస్త జాలి చూపించాలని కోరారు. తారక్ గతం గురించి తెలిసిన తనకు కన్నీళ్లు ఆగలేదని, ఏడ్చేశానని పేర్కొన్నారు. ఇక బెదిరింపులు ఆపేయాలని, ఎన్టీఆర్‌ను చూసి గర్వపడాలని పాయల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న తనను సోషల్ మీడియా వేదికగా తిట్టడం ఆపాలని కోరారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu