బాలీవుడ్ హీరోయిన్ పాయల్ ఘోష్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను వేధించాడని పాయల్ ఫిర్యాదు చేయడంతో ముంబై పోలీసులు అనురాగ్ కాశ్యప్ పై అత్యాచారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో అనురాగ్ కాశ్యప్ ను పోలీసులు సుమారు 8 గంటలు విచారించారు. పాయల్ తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని అనురాగ్ ఇప్పటికే తీవ్రంగా ఖండించాడు. తాజాగా పాయల్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసింది. తనకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తూ కిషన్ రెడ్డికి పాయల్ లేఖ అందజేశారు. ఆ విషయాన్నీ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది పాయల్.
Met up with Shri G Krishan Reddy who is the MOS of @AmitShah ji at @HMOIndia and also the minister of state of home ministry and had a very fruitful and forwarded conversation on the issue. It’s an issue faced by many and now is the time to act. pic.twitter.com/euvBnFbbyy
— Payal Ghosh (@iampayalghosh) October 7, 2020