నటి మీరా చోప్రా, ఎన్టీఆర్ అభిమానుల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తున్న సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మద్దతుగా నిలుస్తూ ఎన్టీఆర్‌కు ఆడవాళ్లంటే చాలా గౌరవం అంటూ వార్తల్లోకి వచ్చింది పాయల్ ఘోష్. తారక్ సరసన ఊసరవెల్లి చిత్రంలో నటించింది పాయల్ ఘోష్. అంతే కాదు ఎన్టీఆర్‌కు పాయల్ వీరాభిమాని . ఇంతకుముందు ట్విట్టర్ లో అవయవాలను దానం చేస్తున్నానని ప్రకటించి అందరిలో స్ఫూర్తి నింపింది పాయల్. నేడు తాజాగా మరోసారి ట్విట్టర్ లో ఛాలెంజ్ విసిరింది. అదికూడా ఎన్టీఆర్‌ను ఆహ్వానించింది. ‘లక్షలాది మందికి ఒక రోల్ మోడల్ గా ముందుకు వచ్చి తారక్ ఈ ప్రయత్నానికి మద్దతు ఇవ్వాలని కోరింది. అవయవ దానం ద్వారా మనం లేనప్పుడు మన అవయవాలు ఇతరులకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి సహాయపడతాయి. ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకు రావాలి. అందరూ కలిసి ఈ సమాజాన్ని జీవించడానికి మంచి ప్రదేశంగా మారుద్దామని పాయల్ ట్వీట్ చేసింది. ఎన్టీఆర్ ఎలా స్పందిస్తాడో చూడాలి