Homeతెలుగు Newsమలివిడత పవన్ ప్రజాపోరాట యాత్ర

మలివిడత పవన్ ప్రజాపోరాట యాత్ర

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజా పోరాట యాత్ర మలివిడత పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభించారు. ప్రజా పోరాటయాత్రకు కొంత విరామం ఇచ్చిన పవన్ మళ్లీ తన యాత్రను ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మంగళవారం వివిధ సంఘాలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. 10 రోజులపాటు జిల్లాలో పర్యటనకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈరోజు ఏడు సంఘాల ప్రతినిథులతో సమావేశమయ్యారు. రోజువారీ భేటీలు కొనసాగిస్తూనే నిర్దేశించిన నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు హాజరుకావాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు.

10 18

ఏలూరులో వందలాది మంది అభిమానులు, కార్యకర్తలు వెంట రాగా స్థానిక క్రాంతి కల్యాణ మండపానికి చేరుకున్నారు. 10 రోజుల పాటు జిల్లాలో బస చేయనున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “పార్టీ సిద్ధాంతాలను గ్రామాలకు చేర్చండి…అందరికీ తెలిసేలా వివరించాలి. క్షేత్ర స్థాయిలో మరింతగా బలపడాలి…అభిమానులు, జన సైనికుల మీద నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది” అన్నారు.

పవన్ కల్యాణ్‌ అంతకుముందు ప్రజాపోరాట యాత్రలో భీమవరం కేంద్రంగా చేసుకుని, పార్టీ వ్యవహారాలు, భేటీలను ఎలా కొనసాగించారో… ఈ విడతలోనూ అదే తరహాలో యాత్ర కొనసాగించబోతున్నారట. అయితే ఈసారి తన సమావేశాల్లో వీలైనంత ఎక్కువమందితో భేటీ కావాలని పవన్‌ కళ్యాణ్ నిర్ణయించినట్లు తెలిసింది. ఆ క్రమంలోనే ఆయన మంగళవారం ఒక్కరోజే ఆయన ఏడు వర్గాలతో విడివిడిగా భేటీ అయ్యారు. ఆటోడ్రైవర్స్‌ అసోసియేషన్‌, డ్రైవర్ల అసోసియేషన్‌, పాస్టర్ల బృందం, ఆలిండియా దళిత రైట్‌ ఫెడరేషన్‌ సభ్యులు, హమాలీలు, రెల్లి సంక్షేమ సంఘం, దివ్యాంగులు, రైతులతో పవన్‌ కల్యాణ్ సమావేశం అయ్యారు. దివ్యాంగులతో సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్నికల్లో దివ్యాంగులకూ అవకాశం కల్పించాలని అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా దివ్యాంగుల పరిస్థితిలో మాత్రం ఏ మార్పు లేదన్నారు. అలాగే ఎన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగినా దివ్యాంగుల సంక్షేమపై చర్చలు.. చర్యలు లేవన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu