టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తే.. ఇక జగన్ రెడ్డి నడ్డి విరిగే ప్రమాదం పొంచి ఉందని కూలీ – నీలి మీడియాకి ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అందుకే.. ఈ పొత్తు పాడవకుండా ఉండటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మరోవైపు
పవన్ కళ్యాణ్ తరచూ రాజకీయ పొత్తులు మార్చే
బ్రోకర్ అంటూ పవన్ పై నెగిటివ్ ప్రచారానికి దిగుతున్నారు.
అనేవి పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. జీవితంలో ఒకేసారి
పెట్టుకోవాలని రాజ్యాగంలో ఏమైనా ఉందా ? లేదు కదా. మరెందుకు ఈ విషయంలో ఒక్క పవన్ కళ్యాణ్ ను తప్పు పడతారు ?.
జగన్ రెడ్డికి అన్ని ఉన్నాయ్, కానీ పవన్ కి అభిమానులు మాత్రమే ఉన్నారు. సొంతంగా న్యూస్ ఛానల్ లేదు, సోషల్ మీడియా బృందం లేదు. నిజానికి సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ యుద్ధం చేస్తూ ఉంటారు. కానీ, ఆ యుద్ధం గాలిలో జరుగుతూ ఉంటుంది. ఎటు తేలదు. దీనికితోడు రెండు వర్గాలుగా ఉండి, ఒకరు వైసీపీ విదేయుల్లా నటిస్తూ.. కొంత మంది పవన్ ఫ్యాన్స్ ను తమ వైపుకు తెచ్చేకునే ప్రయత్నం చేస్తుంటారు. మరి కొందరు యధావిధి రాజుని ఫాలో అవుతుంటారు. పవన్ మాటే వారికి శాసనం. కానీ.. ప్రతి విషయంలో మాటకు మాట చెప్పి రాజకీయం చేయడం కష్టం.
అన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ ది మూడో కూటమి. మరి మూడో కూటమి అంటే ఏమిటి ?, ఎలా నడుచుకోవాలి ?, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే.. అవసరం అయితే ఎవరితో అయినా జత కట్టేలానే ఉండాలి మూడో కూటమి. అప్పుడే ఆ కూటమికి ఉనికి ఉంటుంది. ఇప్పట్లో ప్రజలకు వైసీపీ పాలన నచ్చలేదు, కాబట్టి టీడీపీ వైపు చూస్తున్నాడు పవన్. చూడాలి కూడా. ఒంటరిగా పోటీ చేసి జగన్ రెడ్డికి లాభం చేయడం కంటే.. పొత్తు కోసం తరుచూ నిర్ణయాలు మార్చుకోవడమే మేలు అని పవన్ భావిస్తూ ఉండొచ్చు.
ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రధాన సమస్య గురించి మాట్లాడుకోవాలి. పవన్ పార్టీ కేవలం పవన్ పైనే నడుస్తోంది. ఓ వ్యక్తి ఓ వ్యవస్థను నడిపించాలి అంటే.. అది అంత సులభం కాదు. కాబట్టి.. పవన్ కి ఇప్పుడు పొత్తు అత్యవసరం. మరి ఆ పొత్తు ఎవరితో ఉండాలి ?, న్యూట్రల్ వోటర్స్ ని ఆకట్టుకోవాలి అంటే.. ప్రజా గాలి ఎటువైపు వెళ్తుందో.. అటు వైపే వెళ్ళాలి. అందుకే.. పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీతో పొత్తు కోసం బాహాటంగానే అంగీకరించాడు.
పవన్ అయినా, చంద్రబాబు అయినా జగన్ రెడ్డిని ఎదుర్కోవాలి అంటే.. కలవక తప్పదు. ముఖ్యంగా ఈ అవసరం పవన్ కళ్యాణ్ కే ఎక్కువ ఉంది. కాబట్టే..
పవన్ కళ్యాణ్ తరచూ రాజకీయ పొత్తులు
మారుస్తూ ఉంటాడు అనుకోవచ్చు. ఇది రాజకీయ వ్యూహమే అవుతుంది.