Homeతెలుగు Newsపోలవరం ప్రాజెక్టు దేశానికి పేరు తెస్తుంది: పవన్‌

పోలవరం ప్రాజెక్టు దేశానికి పేరు తెస్తుంది: పవన్‌

8 6పశ్చిమగోదావరి జిల్లా పోలవరం బహిరంగసభలో ఇవాళ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు దేశానికి పేరు తెచ్చే ప్రాజెక్టు అని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంతోపాటు నిర్వాసితులకు న్యాయం చేయాలని సూచించారు. ప్రజల్ని త్యాగాలు చేయాలంటున్న నాయకులెవరు త్యాగాలకి సిద్ధపడడం లేదన్నారు. వేలకోట్లు ఉన్నంతమాత్రాన ముఖ్యమంత్రులు కాలేరని ఈ సందర్భంగా పవన్‌ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పంచాయితీ వ్యవస్థని నిర్వీర్యం చేస్తుంటే వారి అబ్బాయి లోకేష్ పంచాయితీ వ్యవస్థని నిర్జీవం చేస్తున్నారని పవన్‌ ఎద్దేవా చేశారు. పంచాయితీ ఎన్నికలు పెట్టకుండా స్పెషల్ ఆఫీసర్లను ఏర్పాటు చేస్తున్నారని.. అటువంటప్పుడు లోకేష్‌ను మంత్రి పదవి నుంచి తీసేసి స్పెషల్‌ ఆఫీసర్‌ను పెడితే సరిపోతుందని పవన్ అభిప్రాయపడ్డారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu