HomeTelugu Newsవైసీపీ ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇస్తున్నా: పవన్ కళ్యాణ్

వైసీపీ ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇస్తున్నా: పవన్ కళ్యాణ్

6 29జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. వైసీపీ ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇస్తున్నామని అన్నారు. వంద రోజుల తర్వాత ప్రభుత్వ పాలనపై స్పందిస్తామని స్పష్టంచేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలతో పవన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందన్నారు. ఇసుక లేకపోవడం వల్ల తమ పార్టీ కార్యాలయ నిర్మాణం ఆగిపోయిందని చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనకు సిద్ధమవుతామన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ నాయకులు పొత్తు కోసం తనను సంప్రదించారని.. ఒంటరిగా పోటీ చేయాలని అనుకున్నందునే వారితో పొత్తు పెట్టుకోలేదని ఈ సందర్భంగా పవన్‌ స్పష్టం చేశారు.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హరిచందన్‌ రాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో పవన్ అందుబాటులో లేకపోవడంతో హాజరుకాలేకపోయారు. ప్రస్తుతం గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్… ఇవాళ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. పార్టీ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తమ పార్టీ సిద్ధాంతాలు, కార్యకలాపాల గురించి బిశ్వభూషణ్‌ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గవర్నర్‌తో చర్చించినట్లు సమాచారం. గవర్నర్‌ను కలిసిన వారిలో జనసేన ముఖ్య నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు ఉన్నారు.

6a 2

Recent Articles English

Gallery

Recent Articles Telugu