ఈ మధ్య కాలంలో సినిమాల టైటిల్స్ ను ఇదివరకు సినిమాల్లో వచ్చిన పాటలను ఆధారంగా
చేసుకొని పెడుతున్నారు. సోగ్గాడే చిన్ని నాయన, కాటమరాయుడు, ఎక్కడకి పోతావు చిన్నవాడా
ఇలా చాలా సినిమాల టైటిల్స్ పాటల్లోని పదాలే.. ఇప్పుడు గోపిచంద్ నటిస్తోన్న కొత్త సినిమా
టైటిల్ కూడా అలానే పెడుతున్నారు. పవన్ కల్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో
‘ఆరడుగుల బుల్లెట్’ అనే పాట ఎంత పాపులర్ అయిందో.. అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే
పాటను గోపిచంద్, సంపత్ నంది కాంబినేషన్ లో వస్తోన్న సినిమాకు టైటిల్ గా పెట్టనున్నారు.
ఇటీవలే ఈ సినిమా బ్యాంకాక్ లో ఓ షెడ్యూల్ ను పూర్తి చేసుకొంది. సినిమా కథను, గోపిచంద్
పాత్రను దృష్టిలో పెట్టుకొని సినిమాకు ‘ఆరడుగుల బుల్లెట్’ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేస్తున్నట్లు
వార్తలు వస్తున్నాయి.