గత కొన్ని రోజులుగా చిరంజీవి 151వ సినిమా కోసం బోయపాటిని సంప్రదిస్తున్నట్లుగా వార్తలు
వచ్చాయి. కానీ ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. అయితే చిరు 151వ సినిమాని గీతాఆర్ట్స్
బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ఓ స్టేజీ మీద ప్రకటించారు. దీనికోసం
ఆయన కొన్ని నెలలుగా కథలు కూడా వింటున్నారు. ఈ నేపధ్యంలో బోయపాటి చెప్పిన లైన్
నచ్చడంతో వెంటనే చిరంజీవితో, బోయపాటి భేటీ ఏర్పాటు చేశారు. వీరి మధ్య కథా చర్చలు
అనంతరం బోయపాటి చెప్పిన లైన్ నచ్చడంతో చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
స్క్రిప్ట్ ను పూర్తి చేయమని అడ్వాన్స్ కూడా ముట్టజెప్పారు. పవన్ కల్యాణ్, దాసరిల సినిమా
కోసం బోయపాటిని సంప్రదిస్తే రిజక్ట్ చేసిన బోయపాటి చిరు సినిమా మాత్రం ఒప్పుకోవడం
చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం బోయపాటి, బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు.
దీని తరువాత చిరు సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.