నిన్న జరిగిన కాకినాడ సభలో పవన్ కల్యాణ్ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని టార్గెట్
చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. వీటిపై తాజాగా వెంకయ్యనాయుడు స్పందించారు. తనపై
ఎవరో చేసిన వ్యక్తిగత విషయాలపై స్పందించాల్సిన అవసరం లేదంటూ.. ఘాటుగానే
స్పందించారు. రాజకీయాల గురించి తెలిసినవారికి తాను ఆంధ్రప్రదేశ్ కోసం ఏం చేస్తున్నాననే
విషయం తెలుస్తుందని పరోక్షంగా పవన్ ను ఉద్దేశించి అన్నారు. ప్రజలకు మాత్రమే
సమాధానం చెబుతానని.. ఆంధ్ర రాష్టం సమస్యల విషయంలో నేను ఎంత పను చేస్తున్నానో..
వేరే ఎవరు సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. మొత్తానికి పవన్ మాటలతో
కేంద్ర మంత్రి గారు బాగా హర్ట్ అయినట్లే ఉన్నారు.