తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పవన్ కల్యాణ్ లు కలవబోతున్నారు. అయితే ఇది
రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. వీరిద్దరు ఓ ఆడియో ఫంక్షన్ కోసం ఒకే స్టేజ్ మీద
కలవనున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్
గౌడ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘జాగ్వార్’. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం
సెప్టెంబర్ 18న హైదరాబాద్ లో జరగనుంది. ఈ ఆడియో ఫంక్షన్ కు కేసీఆర్, పవన్ కల్యాణ్
లు ముఖ్య అతిథులుగా రానున్నారు. ఇప్పటికే ఈ విషయమై కుమారస్వామి, పవన్
కల్యాణ్ ను కలిశారు. పవన్ కు, కుమారస్వామికు మధ్య మంచి అనుబంధం ఉంది.
పవన్ నాకు సొంత తమ్ముడి లాంటి వాడని గతంలో కుమారస్వామి చెప్పారు. అక్టోబర్ లో
ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.