
Pawan Kalyan Movies:
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ, ఆయన సినిమాలు గురించి ఎన్నో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి, “పవన్ ఇక సినిమాలు చేయరా?”, “రాజకీయాల్లో పూర్తిగా స్థిరపడతారా?” వంటి ప్రశ్నలు ఫ్యాన్స్ మధ్య చర్చనీయాంశంగా మారాయి. అయితే, పవన్ కళ్యాణ్ తాజాగా ఈ విషయంపై స్పందించి అన్ని రూమర్లకు చెక్ పెట్టేశారు.
తాజా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తన సినిమా కెరీర్ గురించి మాట్లాడారు. “నాకు అవసరం ఉన్నంతవరకు సినిమాలు చేస్తాను. సినిమాలు నా ఏకైక ఆదాయ వనరు. ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలని అనుకోలేదు. నేను చేసిన సినిమాలకు న్యాయం చేయాలి” అని చెప్పారు.
అంతేకాకుండా, “హెన్రీ డేవిడ్ థోరో, యోగీలు, సిద్ధుల నుంచి నేను చాలా ప్రేరణ పొందాను. సమాజానికి మేలు చేయాలనేది నా లక్ష్యం. నేను ఎప్పుడూ ధన సంపాదన కోసమే పనిచేయలేదు. కానీ, నటన ద్వారా సంపాదించేది నా జీవనాధారం” అని పవన్ అన్నారు.
రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, పవన్ కళ్యాణ్ ఇప్పటికే కొన్ని సినిమాలకు కమిట్ అయ్యారు. అవి పూర్తి చేసే వరకూ వెనుకాడబోమని చెప్పారు.
1. హరి హర వీర మల్లు – 2025 మే 9 న విడుదల
2. They Call Him OG – 2025 చివరి నాటికి విడుదల
3. ఉస్తాద్ భగత్ సింగ్ – షూటింగ్ త్వరలో రీ-స్టార్ట్
భారీ ఊరట
పవన్ రాజకీయాల్లో విజయవంతమైనప్పటికీ, సినిమా అభిమానులను నిరాశ పరచే ప్రసక్తే లేదని చెప్పిన ఆయన, తన ఫిల్మ్ కమిట్‌మెంట్స్‌ను తప్పకుండా పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. పవన్ ఇకపై సినిమాలు చేస్తారా లేదా అనేది ఎప్పటికప్పుడు చూడాలి కానీ, ఆయన నుండి సినిమాలు చూడలేమనే రూమర్లకు మాత్రం గట్టి సమాధానం ఇచ్చారు.