
Pawan Kalyan Ustaad Bhagat Singh:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటిక్స్‌లో బిజీగా ఉన్నప్పటికీ, ఆయన సినిమాల మీద ఆసక్తి మాత్రం తగ్గలేదు. ఆయన చేస్తున్న మూడు సినిమాల్లో ‘OG’పై మోస్ట్ హైప్ ఉంది. తర్వాత ‘హరిహర వీరమల్లు’ మీద కొంత క్యూరియాసిటీ ఉంది. కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మీద ఎలాంటి క్రేజ్ లేదనుకునే వాళ్లకి షాక్ ఇచ్చేలా హరీష్ శంకర్ కొత్త అప్‌డేట్ ఇచ్చారు.
క్రేజీ యంగ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ‘డ్రాగన్’ సినిమా తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అశ్వత్ మాట్లాడుతూ, ‘‘నాకు పవన్ గారితో పవర్‌ఫుల్ సినిమా చేయాలని ఉంది. అందులో ఆయన కారుపై కూర్చొని స్టైల్‌గా వెళ్లాలి’’ అని చెప్పారు.
దీనికి హరీష్ శంకర్ వెంటనే స్పందించి, ‘‘ఆ సీన్‌ను నేను ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో డిజైన్ చేశాను. పవన్ గారు కారుపై కూర్చొని ప్రయాణించే సీన్ సినిమాలో ఉండబోతోంది. దీనిని ‘హరీష్ లీక్స్’ అని పిలవచ్చు’’ అంటూ అభిమానులకు ఊరట ఇచ్చేలా మాట్లాడారు.
PAWAN KALYAN: ‘USTAAD BHAGAT SINGH’ NEW GLIMPSE UNLEASHED… Director #HarishShankarS and #MythriMoviesMakers unleash the power-packed glimpse of the much-awaited #UstaadBhagatSingh, featuring #PawanKalyan.#BhagatsBlaze 🔗: https://t.co/LLnXWaTgZQ
Produced by Naveen Yerneni and… pic.twitter.com/lw0V22VDi7
— taran adarsh (@taran_adarsh) March 19, 2024
ఈ సీన్ పవన్ నిజజీవిత సంఘటన నుంచి ప్రేరణ పొందింది. 2022లో అప్పటి ప్రభుత్వ ఆంక్షలతో ఇబ్బంది పడుతున్న ఇట్టపమ్ గ్రామస్తులను కలుసుకోవడానికి పవన్ కారుపై కూర్చొని వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ విజువల్స్ అప్పట్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. హరీష్ ఆ రియల్ మూమెంట్‌ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో రీ-క్రియేట్ చేస్తున్నారు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ అసలు తమిళ హీరో విజయ్ నటించిన ‘థెరి’ రీమేక్. హరీష్ శంకర్ గతంలో ‘గబ్బర్ సింగ్’ రీమేక్‌ని సూపర్ హిట్‌గా మార్చిన విధంగా, ఈ సినిమాను కూడా ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది.
ఇప్పుడు హరీష్ ఈ సినిమా ద్వారా మళ్లీ ఫామ్‌లోకి రావాలని చూస్తున్నారు. ‘హరీష్ లీక్స్’ అప్‌డేట్‌తో పవన్ ఫ్యాన్స్ మళ్లీ ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. మరి, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఏ స్థాయిలో హిట్ అవుతుందో చూడాలి!
ALSO READ: పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ మూవీకి Allu Arjun రెమ్యూనరేషన్ ఎంతంటే?