
Pawan Kalyan Ustad Bhagat Singh:
హరీశ్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న Pawan Kalyan సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. గతంలో ‘మిస్టర్ బచ్చన్’ వంటి చిత్రం రవితేజ ప్రధాన పాత్రలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చినా, అది ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు పవన్ కల్యాణ్‌తో హరీష్ కలిసి పని చేస్తూ, ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ త్వరలో పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో, ఇటీవల పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ మధ్య రెండు కీలక సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్‌కి సినిమా షూట్ పునఃప్రారంభం చేయడానికి ముందు పూర్తి డైలాగ్ వెర్షన్ సిద్ధం చేయాలని కోరారు. అందుకు అనుగుణంగా, హరీశ్ శంకర్ తన టీమ్‌తో కలిసి బౌండ్ స్క్రిప్ట్‌పై పని చేస్తున్నారు.
నవంబర్ చివర్లో పవన్ కల్యాణ్‌కి చివరి నేరేషన్ ఇవ్వనున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ తమిళ సినిమా ‘తేరి’కు రీమేక్ అని టాక్ నడుస్తోంది. అది నిజం అయితే.. ఇందులో పవన్ కల్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.. హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్‌లు పూర్తయ్యాయి. మిగిలిన చిత్రీకరణ కోసం పవన్ కల్యాణ్ బల్క్ డేట్స్ కేటాయించడానికి సన్నద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
ఇటీవలే పవన్ కల్యాణ్ తన మరో ప్రాజెక్ట్ ‘హరి హర వీర మల్లు’ షూట్‌లో చేరారు. త్వరలోనే ‘ఓజీ’ చిత్ర సెట్‌ల్లో కూడా పాల్గొననున్నారు. రాజకీయ నేతగా మారిన పవన్ కల్యాణ్ వచ్చే ఏడాది మూడు చిత్రాలు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ALSO READ: Jeeva నటించిన తమిళ్ హారర్ సినిమా ఇప్పుడు ఓటీటీలో!