HomeTelugu Newsమంత్రివర్గ నిర్ణయం తరువాత చర్చిస్తాం: పవన్‌ కళ్యాణ్‌

మంత్రివర్గ నిర్ణయం తరువాత చర్చిస్తాం: పవన్‌ కళ్యాణ్‌

12 11
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై జీఎన్‌రావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అయోమయం, గందరగోళం నెలకొందని అన్నారు. ఈ పరిస్థితి సర్వత్రా శ్రేయస్కరం కాదని ఓ ప్రకటనలో తెలిపారు.” కమిటీ నివేదికపై క్యాబినెట్‌లో సమగ్రంగా చర్చిస్తామని మంత్రులు ప్రకటిస్తున్నారు. మంత్రివర్గ నిర్ణయం తరువాత ఈవిషయంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చిస్తాం. ఆతర్వాత జనసేన పార్టీ నిర్ణయాన్ని ప్రజలముందు ఉంచుతాం. అభివృద్ధి అంటే సంపద సృష్టించే వనరులు ఏర్పాటు చేయడం. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించేదిగా ఉండాలని జనసేన ఆశిస్తోంది. అంతే తప్ప అభివృద్ధి అంటే నాలుగు ప్రభుత్వ కార్యాలయాలనో లేక నాలుగు భవనాలుగానో భావించడం లేదు. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే అభివృద్ధికి జనసేన కట్టుబడి ఉంది. వెనుకబడిన ప్రాంతాల తక్షణ అభివృద్ధిని, రాజకీయ జవాబుదారీతనాన్ని జనసేన కోరుకుంటోంది” అని పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu