పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగునాట ఈ పేరు తెలియని వారుండరనడంలో అతిసయోక్తి లేదు.
అభిమానులకు ఆయన దేవుడితో సమానం. ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న
పవన్ పెద్ద స్టార్ హీరో అయినా.. ఆ గర్వం ఆయనలో కాసింత కూడా కనిపించదు. సాదాసీదా
వ్యక్తిలా జీవిస్తుంటారు. 1972లో సెప్టెంబర్ 2న కొణిదెల వెంకటరావు, అంజనాదేవిలకు
జన్మించాడు పవన్ కల్యాణ్. అన్న మెగాస్టార్ చిరంజీవి సహకారంతో, నటన మీద ఆసక్తితో
1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. తరువాత
ఎన్నో చిత్రాల్లో నటించి హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే జానీ సినిమా ఫ్లాప్
తరువాత దాదాపు పదేళ్ళ వరకు ఆయనకు సరైన హిట్ సినిమా పడలేదు. అలా అని ప్రేక్షకులు
ఆయన్ను మర్చిపోలేదు. ప్రజల గుండెల్లో పవన్ కల్యాణ్ ఎప్పటికీ కింగే.. ‘గబ్బర్ సింగ్’
సినిమాతో పవన్ మ్యానియా మరోసారి రిపీట్ చేశారు. సినిమాల్లో నటిస్తూనే.. అటు రాజకీయాల్లో
తన ప్రవేశం గురించి ప్లాన్ చేసుకుంటున్నారు. ‘జనసేన’ పార్టీను స్థాపించి 2019 ఎన్నికల్లో
పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలనేది పవన్ ఆలోచన. ఇటువంటి గొప్ప వ్యక్తి మరిన్ని
పుట్టినరోజులు చేసుకోవాలని కోరుకుందాం!