HomeTelugu Big Storiesపవన్, త్రివిక్రమ్ ల సినిమా ఫిబ్రవరిలో!

పవన్, త్రివిక్రమ్ ల సినిమా ఫిబ్రవరిలో!

టైటిల్ చూసి సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుందా..? అనుకోకండి. ఆ నెలలో షూటింగ్ మొదలు కానుంది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘కాటమరాయుడు’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం పవన్ ఫోకస్ మొత్తం ఈ సినిమాపైనే ఉంది. ఈ సినిమా షూటింగ్ ఈ నెలలో లేదా జనవరి మొదటి వారంలో పూర్తి కానుంది.

దీని తరువాత వెంటనే పవన్ త్రివిక్రమ్ సినిమా మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యాడట. ఫిబ్రవరి నెల నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి కావొచ్చాయి. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఎమ్మాన్యూయల్ లు నటించనున్నారు.

గతంలో పవన్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఘన విజయాలు సాధించాయి. అదే కోణంలో ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu