HomeTelugu TrendingPawan Kalyan: ఫ్యాన్స్ కోసం మళ్లీ పాట పాడనున్న డిప్యూటీ ముఖ్యమంత్రి

Pawan Kalyan: ఫ్యాన్స్ కోసం మళ్లీ పాట పాడనున్న డిప్యూటీ ముఖ్యమంత్రి

Pawan Kalyan to turn as a singer again?
Pawan Kalyan to turn as a singer again?

Pawan Kalyan song in Hari Hara Veera Mallu:

పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా మారినప్పటికీ, ఇంతకు ముందే కమిట్ అయిన పనులను పునఃప్రారంభించారు. ఉదయం సమయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన విధులను నిర్వర్తిస్తున్న Pawan Kalyan, సాయంత్రం సమయంలో సినిమాల షూటింగ్ సెట్స్ లో చేరి తాను కమిట్ అయిన ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నారు.

తాజాగా, పవన్ కళ్యాణ్ అభిమానులను ఆనందపరిచే వార్త హరి హర వీర మల్లు చిత్ర బృందం నుంచి వచ్చింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ పాటను పాడబోతున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కి సినిమాలలో పాడటం కొత్త కాదు.

గతంలో కూడా తమ్ముడు సినిమాలో ఏం పిల్లా మాటాడవా, తాటి చెట్టు.. ఖుషి లో బై బై బంగారు రమణమ్మ.. జానీ లో నేను సారా తాగుతా, రావోయి మా ఇంటికి.. పంజా లో పాపారాయుడు.. అత్తారింటికి దారేదిలో కాటమ రాయుడు.. అలాగే అజ్ఞాతవాసి లో కొడకా కోటేశ్వరరావు వంటి పాటలను పాడారు. అలాగే, భీమ్లా నాయక్ చిత్రంలో విడుదల కాని ఓ పాటను కూడా రికార్డ్ చేసారు.

హరి హర వీర మల్లు నుంచి వస్తున్న ఈ పాట కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పాడిన పాటలు ఎప్పుడూ బ్లాక్ బస్టర్ లే అయ్యాయి. ఈ పీరియాడిక్ డ్రామాని జ్యోతీ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు, అలాగే ఈ చిత్రం 2025 సమ్మర్ కి విడుదల కానుంది.

Read More: Raa Macha Macha పాట వెనుక ఇంత కథ ఉందా? ఐడియా ఎవరిదో తెలుసా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu