HomeTelugu Big StoriesPawan Kalyan పగలు నటుడిగా మధ్యాహ్నం ఉపముఖ్యమంత్రిగా

Pawan Kalyan పగలు నటుడిగా మధ్యాహ్నం ఉపముఖ్యమంత్రిగా

Pawan Kalyan to resume shootings from September
Pawan Kalyan to resume shootings from September

Pawan Kalyan upcoming movies:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో చాలానే సినిమాలు ఉన్నాయి. చెయ్యాలి అనుకుంటే కొద్ది నెలల్లో అన్ని సినిమాల్లో షూటింగ్స్ పూర్తి చేసేయొచ్చు. కానీ ఒకవైపు రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా తన బాధ్యతలతో బిజీగా ఉన్నా పవన్ కళ్యాణ్.. ఇటు సినిమాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన వరదల కారణంగా.. పవన్ కళ్యాణ్ మిగతా బాధ్యతలు మరింత పెరిగాయి. వాటిని సక్రమంగా పూర్తి చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు త్వరలో తన సినిమా షూటింగ్స్ కూడా తిరిగి మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పటినుంచో కాదు ఈనెల 23వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ మొదలు పెట్టబోతున్నారట.

ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే.. పవన్ కళ్యాణ్ ముందుగా OG లేదా Ustad Bhagat Singh సినిమాలు కాకుండా.. Hari Hara Veera Mallu సినిమాని ముందుగా పూర్తి చేయాలని అనుకుంటున్నారట. నిజానికి ఈ సినిమా నిర్మాతకి పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేస్తానని ఎప్పుడో మాట ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ముందు ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది.

ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత.. సుజిత్ దర్శకత్వంలో OG సినిమా షూటింగ్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. ఈ రెండు పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది హరీష్ శంకర్ దర్శకత్వంలో Ustad Bhagat Singh సినిమాలు పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read More: Pawan Kalyan తో సినిమా కోసం వచ్చే ఏడాది దాకా ఆగాల్సిందేనా?

అయితే సెప్టెంబర్ నుంచి సినిమా షూటింగ్ మొదలయ్యాక పవన్ కళ్యాణ్ 20 రోజులపాటు సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. అయితే 20 రోజుల్లో కూడా ఉదయం పూట సినిమా షూటింగ్స్ చేస్తారట. మధ్యాహ్నం మళ్లీ ఉపముఖ్యమంత్రిగా తన పనులతో బిజీ అవుతారట. ఇలా ఉదయం నటుడిగా.. మధ్యాహ్నం పూట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా.. తన కర్తవ్యాలను నెరవేర్చబోతున్నట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu