పవన్ కల్యాణ్ వీరాభిమాని నితిన్ చాలా స్టేజ్ లలో పవన్ పై అభిమానాన్ని చాటుకున్నాడు. తన సినిమాల్లో కూడా పవన్ ప్రస్తావన ఉండేలా చూసుకుంటుంటాడు. నితిన్ కు తన పట్ల ఉన్న అభిమానంతోనే పవన్, తన ఆడియో ఫంక్షన్స్ కు కూడా హాజరవుతూ ఉంటారు.
వీరి మద్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా పవన్ బ్యానర్ లో నితిన్ సినిమా
చేయనున్నాడనే వార్త వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్, పవన్ కల్యాణ్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు.
పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై సినిమా రూపొందనుంది.ఈ విషయాన్ని నితిన్ తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ప్రస్తుతం నితిన్ 14 రీల్స్ బ్యానర్ లో హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే పవన్ బ్యానర్ లో సినిమా ఉండనుందని సమాచారం. ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేయనున్నారనే
విషయం తెలియాల్సివుంది.