Pawan Kalyan Panchayat Raj Budget:
మిగతా నాయకుల లాగా కాకుండా పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి అయినప్పటి నుంచి.. ప్రజలకి దగ్గరగా ఉంటున్నారు. ప్రజల అభివృద్ధి కోసం ఇప్పటికే ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక నిర్ణయం వైరల్ గా మారింది.
స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల కోసం ప్రభుత్వం పంచాయతీ రాజ్ కి కొంత బడ్జెట్ కేటాయిస్తూ ఉంటుంది. మైనర్ పంచాయతీకి ఆరోజు స్కూల్లో సెలబ్రేషన్స్ కోసం వంద రూపాయలు ఇస్తారు. అదే మేజర్ పంచాయితీ అయితే 250 రూపాయలు ఇస్తారు. గత 34 సంవత్సరాలుగా పంచాయతీకి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చే మొత్తం అది.
కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ హయాం వచ్చింది. ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. 34 ఏళ్ల చరిత్రను పవన్ కళ్యాణ్ తిరగరాయబోతున్నారు. మైనర్ పంచాయితీలకి పవన్ కళ్యాణ్ పదివేల రూపాయలు ఇవ్వనున్నారు.
అంతేకాకుండా మేజర్ పంచాయతీ కోసం 25 వేల రూపాయలు కేటాయిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలని ఘనంగా నిర్వహించమని పంచాయతీ రాజ్ మినిస్టర్ గా కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఘనంగా నిర్వహించడం అంటే ప్రజలను, విద్యార్థులను కూడా ఈ వేడుకల్లో భాగస్వామ్యం చేయడం.
దీని వెనుక ఆ విద్యార్థులలో కానీ ప్రజలలో కానీ.. దేశభక్తి సృష్టించాలి అనేది పవన్ కళ్యాణ్ లక్ష్యం. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్ విజన్ గురించి ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.