HomeTelugu Trendingపవన్‌ కళ్యాణ్‌ ని వెంటాడుతున్న వెన్నునొప్పి

పవన్‌ కళ్యాణ్‌ ని వెంటాడుతున్న వెన్నునొప్పి

8 21జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలోని రౌండ్ టేబుల్ సమావేశానికి రాలేకపోతున్నట్లు ప్రకటించారు. అనారోగ్య సమస్యతో సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. ఈ కారణంగానే మూడ్రోజులుగా ఏ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదన్న పవన్ జనసేన తరపున పార్టీ ప్రతినిథులు సమావేశానికి హాజరవుతారని తెలిపారు. మీడియా స్వేచ్ఛ కోసం విజయవాడలో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాల్సిందిగా పవన్ కళ్యాణ్‌ ను ఆహ్వానించింది.

ఆ సమావేశానికి తాను హాజరుకాలేనంటూ పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో వెన్నుపూసకు గాయమైందని అప్పటి నుంచి అది వేధిస్తోందని ఇటీవల ఎన్నికల ప్రచారంలో అశ్రద్ధ చేయడం వల్ల అది మరింత పెరిగిందని ఆయన వివరణ ఇచ్చాడు. డాక్టర్లు సర్జరీకి వెళ్లమని సలహా ఇచ్చినప్పటికీ సంప్రదాయ వైద్యం మీద నమ్మకంతో ఆ వైద్యం చేయించుకుంటున్నానని అయితే మళ్ళీ కొన్ని రోజులుగా మళ్లీ బ్యాక్ పెయిన్ తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని పేర్కొన్నారు. మీడియా స్వేచ్ఛ కోసం చేస్తున్న పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన పేర్కోన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu