HomeTelugu TrendingAkira Nandan: ఎంట్రీ అదిరింది కదా! ఇక విజిల్స్ షురూ

Akira Nandan: ఎంట్రీ అదిరింది కదా! ఇక విజిల్స్ షురూ

Akira Akira,pawan kalyan

Akira Nandan: ఎంట్రీ అదిరింది కదా! ఇక విజిల్స్ షురూ

Akira Nandan: ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ సాధించిన సంచలనం అంతా.. ఇంతా కాదు.. అయితే ఈ నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ పేరు కన్నా ఎక్కువగా వినిపిస్తున్న పేరు మరొకటి. అది ఎవరంటే మన జూనియర్ పవర్ స్టార్ అకిరా. సోషల్ మీడియాలో గత కొద్ది రోజుల నుంచి.. ఆకిరాకి సంబంధించిన ఫోటోలు..వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

నిన్న మొన్నటి వరకు ప్రతి ఒక్కరిలో ఒక సందేహం ఉండేది. అదేమిటంటే.. పవన్ కళ్యాణ్ ఎందుకు తన కొడుకు అకిరా గురించి.. అకిరా మొదటి సినిమా గురించి ఎటువంటి ఆలోచన చేయటం లేదని. అయితే కొడుకు గురించి తండ్రి కన్నా ఆలోచించేవారు ఎవరుంటారు. పవన్ కళ్యాణ్ చేసిందల్లా ఒక్కతే.. సరైన సమయం కోసం ఎదురు చూడటం. ఫైనల్ గా ఆ సమయం వచ్చేసింది.

పవన్ కళ్యాణ్ పేరు ప్రపంచమంతా మారుమొగుతుండగా.. పవన్ తన కన్నా తనకు వచ్చిన పేరు అకిరా కి ఇవ్వాలి అనుకున్నాడు. అందుకే కరెక్ట్ టైం చూసి కొడుకుని దింపాడు.

ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఫలితాల తరువాత.. పవన్ కళ్యాణ్ పేరు ఎంత మారుమొగుతుందో.. అకిరా పేరు కూడా సోషల్ మీడియాలో అంతే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ గెలిచారు అనగానే.. హైదరాబాదులోని పవర్ స్టార్ నివాసం నుంచి ఒక వీడియో విడుదల అయింది. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ మూడో భార్య వెనుక నిలబడుకొని కనిపించాడు.. అకిరా. ఆ వీడియో బయటకి వచ్చిన దగ్గర నుంచి.. సోషల్ మీడియాలో అకిరా గురించి పోస్టుల మీద పోస్టులు పడ్డాయి. ఇంతకుముందు కూడా అకిరా చాలాసార్లు కనిపించిన.. ఈ వీడియోలో.. ఈ కుర్రాడు హీరో మెటీరియల్ లాగా కనిపించడంతో.. ఇక పవన్ అభిమానులు ఆ వీడియోని తెగ షేర్ చేశారు.

కానీ కథ అక్కడితో ఆగలేదు.. ఆ తరువాత పవన్.. చంద్రబాబుని కలవటానికి వెళ్ళినప్పుడు.. అకిరాని తనతో తీసుకెళ్లాడు. అక్కడ అకిరా ప్రవర్తన చూసి.. పవన్ అభిమానులు తను అచ్చం తన తండ్రిలానే అని కామెంట్స్ పెట్టసాగారు. దీంతో సోషల్ మీడియా మొత్తం అకిరా ఫోటోలు.. వీడియోలు వైరల్ కాసాగాయి.

ఇక ఈరోజు ఏకంగా పవన్ కళ్యాణ్ తన కొడుకుని తీసుకొని.. పీఎం మోడీని సైతం కలిశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక ఫోటో.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

కాగా నిన్న మొన్నటి వరకు తన కొడుకు విషయంలో..సైలెంట్ గా ఉన్న పవన్.. ఇప్పుడు కరెక్ట్ టైం తీసుకుని.. తన కొడుకు అకిరా కి..మంచి ఎలివేషన్ ఇస్తున్నారని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇక ఈ టైం కోసమే పవన్ ఎదురుచూసుంటారేమో అని.. అందుకే ఇలాంటి కరెక్ట్ సమయంలో కొడుకుని దింపి.. జూనియర్ పవర్ స్టార్ అని రుజువు చేయిస్తున్నారని.. తెగ ఆనందంతో కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. మొత్తానికి ఈ రెండు రోజుల్లో అకిరా లేవలే మారిపోయింది. ఇక ఈ జూనియర్ పవర్ స్టార్ సినిమా ఎంట్రీ ఒకటే పెండింగ్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu