HomeTelugu Big Storiesవైసీపీని కూల్చేవరకు నిద్రపోం: పవన్‌ కల్యాణ్‌

వైసీపీని కూల్చేవరకు నిద్రపోం: పవన్‌ కల్యాణ్‌

2 18
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. వైసీపీ వినాశనం మొదలైంది.. భవిష్యత్తులో వైసీపీ మనుగడ ఉండదని అన్నారు. నిన్న పోలీసుల దాడిలో గాయపడిన రాజధాని రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు. కనికరం లేకుండా పోలీసుల లాఠీఛార్జి చేయడం తనకు కంటతడి పెట్టిస్తోందన్నారు. రాజధాని రైతుల గురించి వైసీపీ నేతలు వాడిన పదజాలం ఆ పార్టీ ఆలోచనా విధానమేనన్నారు. ఏపీకి అమరావతే శాశ్వత రాజధానిగా ఉంటుందని హామీ ఇచ్చారు.

”ఇంతమంది రైతులతో కన్నీళ్లు పెట్టించారు. వైసీపీ నేతలు ఫ్యాక్షన్‌ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నారు. రాజధాని ఇక్కడే ఉండాలని సమష్టిగా నిర్ణయం జరిగింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేస్తే కేసులు పెట్టండి. ఒకే సామాజికవర్గం, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ ప్రచారం చేస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ ఇంతమంది ఆడపడుచులను హింసించింది లేదు. ఇంతపెద్ద ఎత్తున భూములు ఇవ్వడం జరగలేదు. వైసీపీ వాళ్లకు అమరావతిలో భూములు ఉంటే రాజధాని మార్చరు. ఇక్కడి నుంచి రాజధాని కదలదు. ధర్మంపై నిలబడితే అది మనల్ని కాపాడుతుంది. అమరావతి పరిరక్షణ సమితితో కలిసి పనిచేస్తాం. రైతులకు మాటిస్తున్నా.. ఎన్ని రాజధానులు మార్చినా శాశ్వత రాజధాని అమరావతే. విశాఖలో భూములు కొని అక్కడికి రాజధాని మారుస్తున్నారు. రైతుల బాధ వింటుంటే ఆవేదన కలుగుతోంది. పాశవికంగా రైతులపై దాడులు చేశారు. వారిని పరామర్శించేందుకు కూడా అనుమతించలేదు. పోలీస్‌ శాఖను వైసీపీ నేతలు వ్యక్తిగతానికి వాడుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు జనసేన నిద్రపోదు. మీ శరీరంపై తాకిన దెబ్బలు నా గుండెలకు బాగా తాకాయి. అమరావతి ఇక్కడే ఉంటుంది.. మీకు అండగా నేనుంటా” అన్నారు.

”రేపు ఢిల్లీకి వెళ్తున్నా.. రాజధాని మార్పుపై అన్నీ వివరిస్తాను. కానీ ఒకటి మాటిస్తున్నా.. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమరావతిని శాశ్వతంగా ఉంచేలా పోరాటం చేస్తాం. అన్ని భయాలూ పక్కన పెట్టండి. నేను అవకాశవాద రాజకీయాలు చేయను. ప్రజలకు మనశ్శాంతి కల్గించే రాజకీయాలు చేస్తా” అని పవన్‌ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu