Pawan Kalyan Salary:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ ప్రతిరోజు ఏదో ఒక విషయమై వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన జీతం విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకొని ప్రజలకు సైతం షాక్ ఇచ్చారు.
తాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పంచాయతీరాజ్ శాఖలో అసలు డబ్బులు లేవని, దానికి తోడు వేలకోట్ల అప్పు ఉందని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలో జీతం తీసుకోను అని చెబుతున్నారు. తాజాగా సంక్షేమ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని వెల్లడించారు.
పంచాయతీరాజ్ విభాగానికి నిధులు లేవు అని అందుకే తాను కూడా ప్రత్యేక భత్యాలు తీసుకోనని మాట ఇచ్చారు. “వేలకోట్ల అప్పుల్లో ఉన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రిని అయ్యుండి డబ్బులు తీసుకోవడం చాలా తప్పు అనిపించింది. అందుకే నాకు జీతం ఇవ్వద్దని చెప్పేసాను” అని అన్నారు పవన్ కళ్యాణ్.
“అంతేకాకుండా సచివాలయం నుంచి వచ్చిన అధికారులు మూడు రోజులు అసెంబ్లీకి వచ్చినందుకు జీతం కింద రోజుకి 35000 ఇస్తామని చెప్పారు. కానీ నేను ఆ జీవితాన్ని తీసుకోలేనని వాళ్ళకి చెప్పాను” అని స్పష్టం చేశారు జనసేనాని.
Pawan Kalyan Salary:
“క్యాంప్ ఆఫీస్ మరమ్మత్తుల గురించి కూడా అధికారులు నన్ను అడిగారు. నేను వారిని ఏమి చేయద్దు, అలాగే ఉంచేయమని చెప్పాను. కొత్త ఫర్నిచర్ కూడా కొనద్దు అని చెప్పాను. అవసరమైతే నేనే నా సొంత డబ్బులతో తీసుకువస్తాను” అని అన్నారు పవన్ కళ్యాణ్.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేస్తున్న పనులు నిజంగా మార్గదర్శకంగా మారుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం పవన్ కళ్యాణ్ తనదైన బాధ్యతను ఈ విధంగా నిర్వర్తిస్తూ ఉండటం ప్రజలను చాలా బాగా ఆకట్టుకుంటుంది.