పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ వస్తున్న విషయం తెలిసిందే. సముద్రఖని దర్శకత్వం వహించిన తమిళ చిత్రం వినోధయ సీతమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. తెలుగులో కూడా సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో కొనసాగుతోంది.
తాజాగా ఇతర నటీనటుల వివరాలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ముందుగా వచ్చిన అప్‌డేట్ ప్రకారం ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. అదేవిధంగా రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.
ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిబొట్ల కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతుండగా.. తెలుగు వెర్షన్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొన్ని మార్పులు చేసినట్టు ఇన్‌సైడ్ టాక్.
ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుండి ఈ సినిమా ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతునే ఉంది. ఇక ఈ సినిమాకి దేవర అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. ఓ స్పెషల్ సాంగ్‌లో శ్రీలీల నర్తించనున్నట్లు తెలుస్తుంది.
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు