HomeTelugu Big Storiesపవన్ కళ్యాణ్ తో లెగో బాండింగ్…యానిమల్ లాంటి చిత్రం చేస్తా. ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్న సాయి ధరమ్ తేజ్

పవన్ కళ్యాణ్ తో లెగో బాండింగ్…యానిమల్ లాంటి చిత్రం చేస్తా. ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్న సాయి ధరమ్ తేజ్

sai dharam tej

డిసెంబర్ నెలలో గలాట్టా ప్లస్ మెగా ప్యాన్-ఇండియా రౌండ్ టేబుల్‌ కాన్ఫరెన్స్ జరగగా అందులో.. సాయి ధరమ్ తేజ్, శృతి హాసన్, శ్రియా రెడ్డి, శోభు యార్లగడ్డ, తరుణ్ భాస్కర్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ షేర్ చేసుకున్న కొన్ని విషయాలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.

ఈ ఇంటర్వ్యూలో ముందుగా సాయి ధరమ్ తేజ్ తన జీవితంలో తను ఎదుర్కొన్న ఎత్తు పల్లాల గురించి పంచుకున్నారు. గతంలో జరిగిన యాక్సిడెంట్ గురించి గుర్తు చేసుకుంటూ.. ఆ టైంలో తన అభిమానులు తన వెంట ఉన్నదాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని ఆనందం వ్యక్తం చేశారు. జీవితం మిమ్మల్ని కిందకు నెట్టినా కూడా మళ్లీ పైకి లేపేందుకు మార్గం చూపుతుంది అని ఆయన పేర్కొన్నారు.

చాలా కాలం సినిమాలకి దూరంగా ఉండి విరూపాక్ష తో విజయం సాధించడం మీకు చాలా ఆనందంగా అనిపించిందా అని అడగగా, సినిమా సక్సెస్ కంటే యాక్సిడెంట్ తర్వాత తన జీవితం బావుంది అని అన్నారు. కోమా నుండి కోలుకున్నాక అభిమానుల నుండి వచ్చిన మెసేజెస్ చదవడం తనకు ‘విరూపాక్ష’ సక్సెస్ కంటే ఎక్కువ సంతోషం ఇచ్చిందని చెప్పుకొచ్చాడు.

భారతీయ సినిమాలు, హాలీవుడ్ సినిమాల మధ్య తేడా గురించి చెబుతూ సాయి ధరమ్ తేజ్ భారతీయ సినిమాలలో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయని.. స్లో మోషన్ లో సీన్లు ఇండియా సినిమాలకు ప్రత్యేక ఆకర్షణ అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇండియా సినిమాల్లో స్లో మోషన్ సన్నివేశాలు ప్రేక్షకులలో ఎమోషన్స్ పండిస్తాయని.. ముఖ్యంగా హీరోలకి ఎంట్రీ సీన్లు స్లో మోషన్ లో ఉండడం ద్వారా ఫాన్స్ కి విజిలెసే అవకాశం దక్కుతుందని అన్నారు.

ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం బయటపెట్టాడు సాయి ధరమ్ తేజ్. ఆయనకున్న ఒక అలవాటు గురించి చెబుతూ ఆయనకి లెగో ఆడడమంటే చాలా ఇష్టమని.. తను ఎప్పుడన్నా తనకు లేదో కొనుక్కుంటే పవన్ కళ్యాణ్ ని కూడా ఒకటి కొనుక్కొని తీసుకెళ్లేవారని చెప్పారు. తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకుంటూ, పవన్ కళ్యాణ్ తనను లెగో ఆడటానికి తరచుగా పిలిచేవారని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న నిర్మాత శోభు యార్లగడ్డ ఫిల్మ్ ప్లానింగ్ టెక్నిక్‌ లు చాలా బాగుంటాయి అని ఆయనని ప్రశంసించారు సాయి ధరమ్ తేజ్. ప్లానింగ్ అనేది సినిమాకి చాలా ముఖ్యమని.. తన రిపబ్లిక్ సినిమా సమయంలో ఆ ప్లానింగ్ వల్లే పది రోజుల్లో కంప్లీట్ అవ్వాల్సిన షూటింగ్ ఐదు రోజుల్లోనే కంప్లీట్ చేశామని చెప్పుకొచ్చాడు.

కరోనా లాక్ డౌన్ తర్వాత మారుతున్న ప్రేక్షకుల అంచనాల గురించి చెప్తూ సాయి ధరమ్ తేజ్ ప్రజలు అన్ని భాషల్లో సినిమాలు చూడటం అలవాటు చేసుకున్నారు అని, ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నారు అనే దాని కంటే ఎలాంటి సినిమాలు చేస్తున్నారు అనేది మాత్రమే చూస్తున్నారని తెలియజేశారు.

చివరగా, సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ వంటి బోల్డ్ స్క్రిప్ట్‌ను తనకు చెప్పుంటే తాను హీరోగా చేయడానికి ఒప్పుకో ఉంటారా అని అడగగా, సాయి ధరమ్ తేజ్ అలాంటి ఛాలెంజింగ్ పాత్రల పట్ల ఆసక్తి వ్యక్తం చేశాడు. తన వద్దకి అలాంటి స్క్రిప్ట్ వస్తే తాను తప్పకుండా చేస్తాను అని..సందీప్ రెడ్డి వంగా ఆ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించారని చెప్పుకొచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu