HomeTelugu Newsవారిని ఇబ్బందిపెట్టే చర్యలను ప్రభుత్వం మానుకోవాలని

వారిని ఇబ్బందిపెట్టే చర్యలను ప్రభుత్వం మానుకోవాలని

12 21
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏపీ రాజధాని రైతుల కౌలు, భూమిలేని పేదల పింఛన్లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ట్విట్‌ చేశారు. కష్టాల్లో ఉన్నవారిని కేసుల పేరిట వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. కరోనా కాలంలోనూ సామాజిక దూరం పాటిస్తూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారని.. వారిని పాత కేసుల పేరుతో పోలీస్ స్టేషన్‌లకు తీసుకువెళ్లడం తగదన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూమి ఇచ్చిన రైతులు, రాజధాని ప్రాంతంలో భూమి లేని పేదలపై సానుభూతి చూపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో కరోనా విజృంభణతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో కౌలు చెల్లింపులో జాప్యం జరిగితే రైతులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు. కరోనా పరిస్థితుల వల్ల తమకు ఇచ్చే కౌలు మొత్తాన్ని పెంచి వెంటనే చెల్లించాలని రైతులు కోరుతున్నట్లు పవన్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. లాక్‌డౌన్‌ సమయంలోనే సీఆర్డీయే మాస్టర్ ప్లాన్‌లో ఆర్-5 జోన్ నిబంధనలు చేర్చి.. రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామనడం వారిని మానసిక ఆందోళనకు గురిచేయడమే అవుతుందదని పవన్‌ అభిప్రాయపడ్డారు. రైతులను ఇబ్బందిపెట్టే చర్యలను ప్రభుత్వం సత్వరమే మానుకోవాలని పవన్ కల్యాణ్‌ సూచించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu