HomeTelugu Big Storiesకౌన్ బనేగా కరోర్ పతి లో Pawan Kalyan గురించిన ప్రశ్న

కౌన్ బనేగా కరోర్ పతి లో Pawan Kalyan గురించిన ప్రశ్న

Pawan Kalyan related question in Kaun Banega Crorepati
Pawan Kalyan related question in Kaun Banega Crorepati

Pawan Kalyan question in KBC:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోగానే కాకుండా రాజకీయాల్లో సక్సెస్‌ఫుల్ నేతగానూ గుర్తింపు పొందారు. 2024 ఏపీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన తర్వాత, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసారు. జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడంతో దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ సెన్సేషన్ అయ్యారు.

అయితే, పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయాల్లోనే కాదు, ఇటీవల కరోర్ పతి సీజన్ 16 వల్ల కూడా హాట్ టాపిక్ అయ్యారు. అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ఈ గేమ్ షోలో ఓ కంటెస్టెంట్‌కి “2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నటుడు ఎవరు?” అనే ప్రశ్న అడిగారు. ఆసక్తికరంగా జవాబు తెలియని ఆ కంటెస్టెంట్ ఆడియన్స్ పోలింగ్‌ని ఎంచుకోగా, 50 శాతం మంది పవన్ కళ్యాణ్ అని చెప్పారు. దీంతో అదే ఆప్షన్ లాక్ చేసిన ఈ కంటెస్టెంట్ రూ.1.60 లక్షలు గెలుచుకున్నారు.

Read More: Pawan Kalyan పగలు నటుడిగా మధ్యాహ్నం ఉపముఖ్యమంత్రిగా

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూర్తిగా ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. OG, హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల నిర్మాతలకు తమ సినిమాల్లో మిగిలిన భాగాన్ని త్వరగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఇకపై కొత్త సినిమాలను తీసుకోకుండా, పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టనున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu