మెగా వారసుడు వరుణ్‌తేజ్ -లావణ్య త్రిపాఠి ఓ ఇంటివారైన విషయం తెలిసిందే. ఇటలీలోని టస్కానీలో బుధవారం రాత్రి వరుణ్‌తేజ్-లావణ్య త్రిపాఠి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఇక వెడ్డింగ్‌లో మెగా హీరోలంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. ఇప్పటికే మెగాఫ్యామిలీ వెడ్డింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ ఈవెంట్‌లో ఓ స్టిల్ ఇప్పుడు అందర్ని ఆకట్టుకుంటుంది. పవన్ కల్యాణ్ , రామ్‌చరణ్ ఈవెంట్ వెన్యూ లొకేషన్‌లో నవ్వుతూ కనిపించారు.
అక్కడే ఉన్న కెమెరాలు క్లిక్ మనిపించాయి. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియా ఫ్యాన్స్ పేజీల్లో తెగ వైరల్ అవుతోంది. చాలా కాలం తర్వాత తమ అభిమాన యాక్టర్లు ఇలా ఒక్క చోట ఛిల్ అవుట్ మూడ్‌లో కనిపిస్తుండటంతో అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.