Pawan Kalyan Punch on Allu Arjun:
తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మారుతున్న సినిమా కల్చర్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కావాలనే జనసేనాని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మీద కౌంటర్ వేశారు అంటూ కొందరు కామెంట్లు మొదలుపెట్టారు.
ఈమధ్య కాలంలో కల్చర్ ఎలా మారిపోయిందో నేను నా కొలీగ్ తో మాట్లాడాను. కొన్నేళ్ల క్రితం సినిమాకి ఇప్పుడు సినిమాకి చాలా తేడాలు ఉన్నాయి. 40 ఏళ్ల క్రితం సినిమా అంటే హీరో ఒక అడవిని కాపాడేవాడు. కానీ ఇప్పుడు హీరోయిజం అలా లేదు. హీరో అడవుల్లో చెట్లు నరుకుతాడు.. వాటిని స్మగ్లింగ్ చేస్తాడు.. అదే హీరోయిజం అయిపోయింది. నేను కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడినే. నాకు అలాంటి సినిమాలు అసలు నచ్చవు. ఏదైనా సినిమా చేస్తుంటే నేను ఆ సినిమాతో సరైన సందేశమే ఇస్తున్నానా లేదా అని.. స్ట్రగుల్ నాకు ఎప్పుడు ఉంటుంది. నా సంగతి పక్కన పెడితే.. ఈ కాలంలో కల్చరల్ షిఫ్టింగ్ జరిగే విధానం చాలా ఆసక్తికరంగా ఉంది” అని అన్నారు పవన్ కళ్యాణ్.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరో స్మగ్లింగ్ చేస్తాడు అంటే అందరికీ గుర్తొచ్చిన ఒకే ఒక్క సినిమా పుష్ప. ఈ సినిమాతో నేషనల్ అవార్డు కూడా అందుకున్న అల్లు అర్జున్ మీద పవన్ కళ్యాణ్.. కావాలనే ఇండరెక్టుగా పంచలు వేశారు అని.. కొందరు కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కావాలని అల్లు అర్జున్ మీద వ్యాఖ్యలు చేసిన చేయకపోయినా.. పుష్ప సినిమా పెద్ద బ్లాక్బస్టర్ అయినప్పటికీ.. చాలామందికి సినిమా నచ్చలేదు. హీరో పాత్ర కి నెగిటివ్ షేడ్స్ ఉన్న పర్లేదు కానీ.. చట్టవ్యతిరేక పనులు చేయడం, సమాజాన్ని తప్పు దోవ పట్టించే కథలలో నటించడం చాలా మంది. జీర్ణించుకోలేకపోయారు.
మామూలు ప్రజలకే నచ్చకపోతే.. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. ఆయనకి నచ్చే అవకాశమే లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ కామెంట్లు అల్లు అర్జున్ మీద కోపంతోనో.. ద్వేషంతోనో చేసినవి అనేకంటే.. కేవలం తన అభిప్రాయాన్ని వ్యక్త పరచడానికి మాత్రమే చేసినట్టు చెప్పుకోవచ్చు. మరోవైపు పుష్ప సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 డిసెంబర్ 6న విడుదల కాబోతోంది.