HomeTelugu Newsప్రత్యేక హోదా అడిగిన వారే నేడు తూట్లు పొడుస్తున్నారు:పవణ్‌ కళ్యాణ్‌

ప్రత్యేక హోదా అడిగిన వారే నేడు తూట్లు పొడుస్తున్నారు:పవణ్‌ కళ్యాణ్‌

12జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జమ్మూకశ్మీర్‌లాంటి సమస్యకు పరిష్కారాలు వెతుకుతున్నప్పుడు.. కాపుల రిజర్వేషన్‌ సమస్యను పరిష్కరించడం చాలా సులభమని అన్నారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కాపుల రిజర్వేషన్‌ జగన్ రాజకీయ కోణంలో చూస్తున్నారు. వ్యక్తిగత కక్షలతో పోలవరం ప్రాజెక్టును ఆపడం సరైనది కాదు. గత ప్రభుత్వ హయాంలో ఏమైనా తప్పులు, అవినీతి జరిగి ఉంటే వాటిని ఎత్తిచూపాలి, అంతేకానీ ప్రాజెక్టులు ఆలస్యం చేయటం సరికాదు. అలాంటి చర్యలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయి. అవినీతిని వెలికి తీస్తామంటున్న విషయంలో జనం నష్టపోకూడదు. అమరావతిలో పనులు ఆపడం వల్ల విదేశీ పెట్టుబడులపై విశ్వసనీయత పోతుంది. ఇది సరైన నాయకులు చేసే పని కాదు. ఏపీకి ప్రత్యేక హోదా అడిగిన వారే తిరిగి నేడు తూట్లు పొడుస్తున్నారు. నాయకుల్లో ప్రజల్లో ఆవేదన ఉంటేనే హోదా సాధ్యమవుతుంది. తెలంగాణ ప్రజల్లో ఉన్న భావోద్వేగం ఏపీ ప్రజల్లో లేదు’ అని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu