భవన నిర్మాణ కార్మికుల కోసం పార్టీలన్నీ సంఘటితం కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ సమస్యపై ఇప్పటికే బీజేపీ, వామపక్షాలు స్పందించాయన్నారు. విపత్కర పరిస్థితులపై పోరుకు మిగతా పార్టీలూ ముందుకు రావాలని కోరారు. కార్మికుల ఆక్రోశం, ఆవేదన ప్రభుత్వానికి అర్థమయ్యేలా చేయాలన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు బాధ కలిగిస్తున్నాయనీ.. నెలల తరబడి ఉపాధిలేక కష్టాలపాలై వారు ప్రాణాలు తీసుకుంటున్నారని పవన్ ఆవేదన వ్యక్తంచేశారు. బాధ్యతాయుతమైన రాజకీయా పార్టీలుగా మనమంతా కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికులకు నవంబర్ 3న విశాఖలో సంఘీభావం తెలపుదామన్నారు.