HomeTelugu TrendingPawan Kalyan OG: అకీరా కోసమైనా పవన్ కళ్యాణ్ సినిమా చేస్తారా

Pawan Kalyan OG: అకీరా కోసమైనా పవన్ కళ్యాణ్ సినిమా చేస్తారా

Pawan Kalyan OG
Pawan Kalyan OG should resume for Akira?

Pawan Kalyan OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో చాలానే సినిమాలు ఉన్నాయి కానీ అందులో ఒకటి కూడా విడుదలకి సిద్ధమవడం లేదు. ముఖ్యంగా అభిమానులు అందరూ ఎదురుచూస్తున్న సినిమా ఓజీ. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

డైరెక్టర్ అవ్వడం కంటే ముందు నుండి సుజీత్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. ఒక ఫ్యాన్ గా పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలి అనుకున్నాడో ఈ సినిమాలో అలానే చూపించబోతున్నాడు అని టాక్ కూడా ఉంది. అందుకే ఈ సినిమా మీద అంత హైప్ క్రియేట్ అయ్యింది. పైగా ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించనున్నారు.

అభిమానులతో పాటు అకిరా నందన్ ఓజీ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. అకిరా కూడా తన తండ్రిని గ్యాంగ్స్టర్ పాత్రలో చూడాలని వెయిట్ చేస్తున్నాడు అని హీరో అడివి శేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారు. ఈ నేపథ్యంలో కనీసం అకీరానందన్ కోసం అయినా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా పూర్తి చేస్తే బాగుంటుంది అని కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలతోనే బిజీగా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు సమయం కుదుర్చుకొని సినిమాలు పూర్తి చేస్తారో చూడాలి.

Pawan Kalyan OG Release Date:

డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై డివివి దానయ్య ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదల కావాలి. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయ పనులతో బిజీ అవడం వల్ల ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడి సినిమా విడుదల కూడా వాయిదా పడింది.

ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు కానీ అదే రోజున ఎన్టీఆర్ దేవర సినిమా విడుదల కు సిద్ధమవుతుండడంతో ఓజీ సినిమా వాయిదా పడినట్లే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రియ రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా కనీసం వచ్చే ఏడాది అయినా విడుదలవుతుంది అని అభిమానులు ఆశిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu